జూబ్లీహిల్స్‌లో దూసుకెళ్తున్న ఫెరారీ కారును ఆపిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అతివేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్.. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్ధం ఇచ్చే సైలెన్సర్ల గోల.. కరోనా లాక్‌డౌన్‌తో వీటన్నీంటికి కొంతకాలంగా బ్రేక్ పడింది. అనంతరం కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్‌తో మళ్లీ మొదలయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో గత రెండు వారాల నుంచి దూసుకెళ్తున్న బైక్‌లు, కార్లు భయాందోళనకు గురిచేస్తున్నాయి.
► కొత్తకొత్త మోడల్స్‌లో వస్తున్న కార్లు, బైక్‌లు రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్తున్నాయి. గతంలో శని, ఆదివారాల్లో రాత్రిపూట మాత్రమే తిరిగిన ఈ స్పోర్ట్స్ బైక్‌లు, కార్లు ఇప్పుడు పట్టపగలు కూడా సాధారణ రోజుల్లో చెలరేగిపోతున్నాయి.
► గతంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పోష్ లొకాల్టీల్లో ప్రధాన రహదారుల్లో తనిఖీలు నిర్వహించే వారు. అదుపుతప్పిన వేగం, అధిక శబ్ధంతో వెళ్లే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించే వారు.
► కోవిడ్ కారణంగా గత ఏడాదిన్నర నుంచి పోలీసుల తనిఖీలు అటకెక్కాయి. ఇదే అదనుగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచి్చ»ౌలి రోడ్లు సైలెన్సర్లు తొలగించిన వాహనాల అధిక శబ్ధంతో అల్లాడిపోతున్నాయి.
చదవండి: ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు: సీపీ అంజనీ కుమార్
► శబ్ధ కాలుష్యం ఒకవైపు, మితిమీరిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇంకోవైపు సాధారణ ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి.
► పబ్‌ల నుంచి బయటికి వచ్చే క్రమంలో యువత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు, బైక్‌లపై అర్ధరాత్రి అతివేగంతో దూసుకెళ్తుండటంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
► ఒకవైపు అధిక వేగం ఇంకోవైపు అధిక శబ్ధం స్థానికులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా స్పెషల్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉంది.
► గడిచిన ఏడాదికాలంగా సంపన్నులు నివసించే ఈ కాలనీల్లో 250కి పైగా ఖరీదైన కార్లు రోడ్లెక్కాయి. ఇందులో చాలా కార్లకు ఇంకా నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయలేదు. దీనిపై కూడా పోలీసులు దృష్టి సారించడం లేదు.
పొరపాటున పట్టుకుంటే ఫోన్‌కాల్స్...
► కోట్లాది రూపాయలు వెచ్చిం కొనుగోలు చేస్తున్న కొత్త మోడల్ కార్లను అదుపుతప్పిన వేగంతో నడుపుతున్న వారిని పొరపాటున పోలీసులు ఆపితే వారికి ఐదు నిమిషాల్లోనే ‘పెద్దల’ నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయి.
► ఆ కారు మన వాళ్లదే.. వదిలేయండి.. అంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఇక వీటిని పట్టుకోవడం ఎందుకంటూ వదిలిపెడుతున్నారు.
► ఇదే అదనుగా బడాబాబుల పుత్రరత్నాలు చెలరేగిపోతున్నాయి.
► రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఓ సమావేశానికి బందోబస్తుకు వెళ్లిన జూబ్లీహిల్స్ పోలీసులకు ఆ రోడ్లపై రయ్..రయ్.. మంటూ దూసుకెళ్తున్న ఫెరారీ కారు కనిపించింది. దీంతో ఆ కారు ఆపి నడిపిస్తున్న వ్యక్తిని ప్రశ్నించగా కొద్దిసేపట్లోనే పోలీసులకు ఆ కారు వదలాలంటూ ఫోన్‌కాల్ వచ్చింది.
చదవండి: రెండు తలల పాము @ 70 లక్షలు.. ఈ పాము ఇంట్లో ఉంటే..
Comments
Please login to add a commentAdd a comment