luxury bikes
-
లగ్జరీ క్రేజ్.. హైదరాబాద్ రోడ్లపై రూ.కోటి నుంచి రూ.7 కోట్ల ఖరీదైన కార్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ రహదారులపై ఖరీదైన కార్లు దూసుకెళ్తున్నాయి. ‘హై ఎండ్’.. సిటీ ట్రెండ్‌గా మారింది. ఒకవైపు నగరం నలువైపులా ఆకాశమే హద్దుగా వెలిసే హైరేజ్ అపార్ట్మెంట్లు, విశాలమైన విల్లాలతో భాగ్యనగరం అంతర్జాతీయ హంగులను సంతరించుకొంటోంది. బడా కార్పొరేట్ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలోనే నగరంలో తిరిగే హైఎండ్ కార్ల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు రూ.కోట్లు ఖరీదు చేసే కార్లను వినియోగిస్తున్నాయి. పదేళ్ల క్రితం వరకు నగరంలో అక్కడక్కడా అరుదుగా మాత్రమే హైఎండ్ వాహనాలు కనిపించేవి. కానీ ఇప్పుడు అన్ని చోట్ల ‘భారీ బడ్జెట్’ విలాసవంతమైన కార్లు విరివిగా రోడ్డెక్కుతున్నాయి. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో నగరానికి దిగుమతి అవుతున్నాయి. రవాణాశాఖ లెక్కల ప్రకారం ఏటా వెయ్యికి పైగా కార్లు, 300కు పైగా బైక్‌లు నమోదవుతున్నాయి. హై...రయ్.. హై ఎండ్ వాహనాల్లో బైక్‌ల కంటే కార్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. రూ.50 లక్షల ఖరీదు చేసే ఫార్చునర్ లెజెండర్ వంటి కార్లు మొదలుకొని రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల ఖరీదు చేసే రోల్స్ రాయిస్ వంటి కార్ల వరకు ఇప్పుడు హైదరాబాద్ అంతటా కనిపిస్తున్నాయి. ఎగువ మధ్య తరగతి, ఒక స్థాయి సంపన్న వర్గాలు ఎంజీఎం హెక్టార్, ఇన్నోవా, కియా వంటి కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో పారిశ్రామిక, సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులలో హైఎండ్ కేవలం స్టేటస్ సింబల్‌గానే కాకుండా అభిరుచిగా కూడా మారింది. దీంతో లంబోర్గిని, ఫెరారీ, బుగాటి, బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ, పోర్షే వంటి విలాసవంతమైన కార్లు రహదారులపై పరుగులు తీస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, నగరమంతటా పరుచుకున్న ఫ్లై ఓవర్లు, తళతళలాడుతూ దూసుకొనిపోయే ఈ లగ్జరీ కార్లతో హైదరాబాద్ అందం మరింత ద్విగుణీకృతమై కనిపిస్తోంది. అలాగే ఖరీదైన బైక్‌లు కేటీఎం, జావా, బుల్లెట్ వంటివి సైతం పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. చదవండి: కాలేజీలకు ‘ఐటీ’ టెన్షన్.. డొనేషన్ల వివరాలు చెప్పొద్దంటూ తల్లిదండ్రులకు ఫోన్లు ఇలా తగ్గి.. అలా పెరిగాయి.. కోవిడ్ మహమ్మారి విజృంభించిన 2020 సంవత్సరం మినహా హైఎండ్ వాహనాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఆ ఒక్క సంవత్సరం మాత్రం 998 కార్లు, 342 బైక్‌లు ఆరీ్టఏలో కొత్తగా నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1,879 లగ్జరీ కార్ల విక్రయాలు జరిగాయి. బైక్‌ల సంఖ్య మాత్రం 309కి తగ్గుముఖం పట్టింది. రూ.లక్షలు వెచి్చంచి స్పోర్ట్స్ బైక్‌లు కొనుగోలు చేయడం కంటే కార్లు సొంతం చేసుకోవడం మంచిదనే భావనతో బైక్‌ల కొనుగోళ్లు కొద్దిగా తగ్గినట్లు షోరూంల నిర్వాహకులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాత స్పోర్ట్స్ బైక్‌ల పట్ల యువతలో ఆసక్తి కూడా తగ్గినట్లు కనిపిస్తోందని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయిదేళ్లుగా హైఎండ్ వాహనాల నమోదు ఇలా.. సంవత్సరం బైక్‌లు కార్లు మొత్తం 2018 321 1,270 1,591 2019 374 1,334 1,708 2020 342 998 1,340 2021 326 1,642 1,968 2022 309 1,879 2,188 మొత్తం 7,123 1,672 8,795 -
డైనమిక్ ఫీచర్లతో బీఎండబ్ల్యూ కొత్త బైక్స్, ధర తెలిస్తే షాక్!
సాక్షి,ముంబై: అంత్యంత ఖరీదైన బైక్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ సిరీస్‌లో 2022 బైక్స్ మోడల్స్‌ను ఇండియా మార్కెట్లలో లాంచ్ చేసింది. లగ్జరీ బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2022 మోడల్స్ బైక్స్‌ని ప్రీమియం టూరింగ్ రేంజ్లో బీఎండబ్ల్యూ ఇండియా తీసుకొచ్చింది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన కే 1600 గ్రాండ్ అమెరికా ధర రూ. 33 లక్షలు (ఎక్స్-షోరూమ్)గాను, బేస్ వేరియంట్ ఆర్1250 ఆర్టీ ధరను రూ. 23.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) గాను కంపెనీ నిర్ణయంచింది. R1250 RT, K 1600 బాగర్, K 1600 GTL, K 1600 గ్రాండ్ అమెరికా ఇలా నాలుగు వేరియంట్లలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2022 బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ నెలలోనే డెలివరీలు ప్రారంభం. ఫ్రెష్ లుక్స్, డైనమిక్స్ ఫీచర్లతో పాటు, లెజెండరీ 2-సిలిండర్ బాక్సర్ ఇంజన్ బీఎండబ్ల్యూ ShiftCam లాంటి స్పెషల్ ఫీచర్లతో లాంగ్ హైవే రైడర్లకు స్మూత్ రైడింగ్ ఫీలింగ్ వస్తుందని కంపెనీ తెలిపింది. కే1600లో 6సిలిండర్ ఇన్-లైన్ ఇంజన్ అమర్చింది.ఇది 6750 RPM వద్ద 160 HPని, 5250 RPM వద్ద 180 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇక R 1250 RT లో 1254 cc ఇంజీన్ 7750 RPM వద్ద 136 HP, 6250 RPM వద్ద 143 Nm శక్తిని అందిస్తుంది. బీఎండబ్ల్యూ కే-1600 GTL డ్రాగ్ టార్క్ కంట్రోల్ (డైనమిక్ ఇంజన్ బ్రేక్ కంట్రోల్), డైనమిక్ ESA పవర్‌ట్రెయిన్, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ కనెక్టివిటీ, కొత్త 10.25-అంగుళాల TFT కలర్ డిస్ప్లే అద్భుతమైన రీడబిలిటీ , స్పష్టమైన మెను నావిగేషన్, ఆడియో సిస్టమ్ 2.0 ఫీచర్‌ను జోడించింది. ఈ కొత్త బైక్స్ వివిధ రంగుల ఎంపికలలో అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్స్‌ను సొంతం చేసుకున్న కస్టమర్లకు బీఎండబ్ల్యూ పలు ఆఫర్లు కూడా ఇస్తోంది. అన్ లిమిటెడ్ కిలీమీటర్లు, 3 సంవత్సరాల పాటు ప్రామాణిక వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్, 24×7 365-రోజుల బ్రేక్‌డౌన్ ప్యాకేజీ లాంటివి ప్రకటించింది. -
రయ్ రయ్‌మంటూ రోడ్లపైకి.. 5 నిమిషాల్లోనే ‘పెద్దల’ నుంచి ఫోన్స్
సాక్షి, హైదరాబాద్: అతివేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్.. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్ధం ఇచ్చే సైలెన్సర్ల గోల.. కరోనా లాక్‌డౌన్‌తో వీటన్నీంటికి కొంతకాలంగా బ్రేక్ పడింది. అనంతరం కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్‌తో మళ్లీ మొదలయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో గత రెండు వారాల నుంచి దూసుకెళ్తున్న బైక్‌లు, కార్లు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ► కొత్తకొత్త మోడల్స్‌లో వస్తున్న కార్లు, బైక్‌లు రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్తున్నాయి. గతంలో శని, ఆదివారాల్లో రాత్రిపూట మాత్రమే తిరిగిన ఈ స్పోర్ట్స్ బైక్‌లు, కార్లు ఇప్పుడు పట్టపగలు కూడా సాధారణ రోజుల్లో చెలరేగిపోతున్నాయి. ► గతంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పోష్ లొకాల్టీల్లో ప్రధాన రహదారుల్లో తనిఖీలు నిర్వహించే వారు. అదుపుతప్పిన వేగం, అధిక శబ్ధంతో వెళ్లే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించే వారు. ► కోవిడ్ కారణంగా గత ఏడాదిన్నర నుంచి పోలీసుల తనిఖీలు అటకెక్కాయి. ఇదే అదనుగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచి్చ»ౌలి రోడ్లు సైలెన్సర్లు తొలగించిన వాహనాల అధిక శబ్ధంతో అల్లాడిపోతున్నాయి. చదవండి: ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు: సీపీ అంజనీ కుమార్ ► శబ్ధ కాలుష్యం ఒకవైపు, మితిమీరిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇంకోవైపు సాధారణ ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ► పబ్‌ల నుంచి బయటికి వచ్చే క్రమంలో యువత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు, బైక్‌లపై అర్ధరాత్రి అతివేగంతో దూసుకెళ్తుండటంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ► ఒకవైపు అధిక వేగం ఇంకోవైపు అధిక శబ్ధం స్థానికులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా స్పెషల్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉంది. ► గడిచిన ఏడాదికాలంగా సంపన్నులు నివసించే ఈ కాలనీల్లో 250కి పైగా ఖరీదైన కార్లు రోడ్లెక్కాయి. ఇందులో చాలా కార్లకు ఇంకా నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయలేదు. దీనిపై కూడా పోలీసులు దృష్టి సారించడం లేదు. పొరపాటున పట్టుకుంటే ఫోన్‌కాల్స్... ► కోట్లాది రూపాయలు వెచ్చిం కొనుగోలు చేస్తున్న కొత్త మోడల్ కార్లను అదుపుతప్పిన వేగంతో నడుపుతున్న వారిని పొరపాటున పోలీసులు ఆపితే వారికి ఐదు నిమిషాల్లోనే ‘పెద్దల’ నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ► ఆ కారు మన వాళ్లదే.. వదిలేయండి.. అంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఇక వీటిని పట్టుకోవడం ఎందుకంటూ వదిలిపెడుతున్నారు. ► ఇదే అదనుగా బడాబాబుల పుత్రరత్నాలు చెలరేగిపోతున్నాయి. ► రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఓ సమావేశానికి బందోబస్తుకు వెళ్లిన జూబ్లీహిల్స్ పోలీసులకు ఆ రోడ్లపై రయ్..రయ్.. మంటూ దూసుకెళ్తున్న ఫెరారీ కారు కనిపించింది. దీంతో ఆ కారు ఆపి నడిపిస్తున్న వ్యక్తిని ప్రశ్నించగా కొద్దిసేపట్లోనే పోలీసులకు ఆ కారు వదలాలంటూ ఫోన్‌కాల్ వచ్చింది. చదవండి: రెండు తలల పాము @ 70 లక్షలు.. ఈ పాము ఇంట్లో ఉంటే.. -
భారత మార్కెట్లోకి బోన్‌విల్ బాబర్ కొత్త బైక్
ముంబై: బ్రిటన్ ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ట్రయంఫ్ మంగళవారం తన బోన్‌విల్ బాబర్ మోడల్ అప్డేట్ వెర్ష్షన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర ఎక్స్ షోరూం వద్ద రూ.11.75 లక్షలుగా ఉంది. ఇందులో ఇంజిన్‌తో పాటు సాంకేతికతను, ఎక్విప్మెంట్ను ఆధునీకరించారు. ఈ బైక్‌లో 1200 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 6100 ఆర్పీఎమ్ వద్ద 78 పీస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఇంజిన్ యూరో 5 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తక్కువ ఉద్గారాలను, ఎక్కువ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్‌కి బ్లాక్ కలర్ అవుట్‌లుక్ ఇవ్వబడింది. 12 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయల్ ట్యాంక్‌ను అమర్చారు. రోడ్, రైన్ రైడింగ్ మోడ్లతో వస్తుంది. బాబర్ బ్రాండ్‌కు భారత్‌లో మంచి డిమాండ్ ఉందని, అందుకే ఏడాది విరామం తర్వాత దేశీయ మార్కెట్లోకి తీసుకున్నామని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ సోహెబ్ ఫారూక్ తెలిపారు. చదవండి: ఎస్బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు -
భారత్ లో విడుదలైన లగ్జరీ బీఎండబ్ల్యూ బైక్
ముంబై: జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్యూ మంగళవారం ఆర్ 18 క్లాసిక్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధరను రూ.24 లక్షలు. ఈ బైక్ ఇంజిన్ సామర్థ్యం 1902 సీసీగా ఉంది. ఇందులో 6 గేర్లు ఉన్నాయి. రెయిన్, రోల్, రాక్ మోడ్స్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. పొడవైన విండ్ స్కీన్ ప్యాసింజర్ సీట్, ఎల్ఈడీ అదనపు హెడ్ లైట్లు, స్యాడిల్ బ్యాగ్స్ 16-ఇంచ్ ఫ్రంట్ వీల్ తో పాటు ఇంటిగ్రేటెడ్ డిజిటల్ డిస్ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ ట్రక్ కంట్రోల్, హిల్ స్వార్డ్ కంట్రోల్. కీలెస్ రైడ్ సిస్టం, ఎలక్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ సీబీయూ(కంప్లీట్లే బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా భారత్‌లకి దిగుమతి అవుతుందని, డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని బీఎండబ్య్యూ తెలిపింది. చదవండి: క్వాల్‌కామ్‌తో ఎయిర్టెల్ జట్టు కొత్తగా ముస్తాబైన మారుతి స్విఫ్ట్ -
బీఎండబ్ల్యూ సూపర్ బైక్స్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోట్రాడ్ ఇండియా కొత్త ఎఫ్ 900 ఆర్, ఎఫ్ 900 ఎక్స్ఆర్ బైక్‌లను దేశంలో విడుదల చేసింది. ఎఫ్900 ఆర్‌ను సింగిల్ స్టాండర్డ్ వేరియంట్లో లాంచ్ చేయగా , ఎక్స్ ఆర్ మోడల్‌ను స్టాండర్డ్, ప్రో వేరియంట్లలో అందుబాటులో వుంటాయి. ఈ రెండు బైక్‌లను జర్మనీలోని కంపెనీ ఫ్యాక్టరీల నుండి దిగుమతి చేస్తోంది. ఎఫ్ 900 ఆర్ ధర రూ .9.90 లక్షలు కాగా, ఎఫ్ 900 ఎక్స్ఆర్ స్టాండర్డ్ ధర, రూ .10.50 లక్షలు. ప్రో వేరియంట్ (ఎక్స్‌షోరూమ్, న్యూఢిల్లీ) ధర రూ.11. 50 లక్షలుగా నిర్ణయించింది. (ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో లాంచ్.. ధర ఎంతంటే?) ఈ రెండు బైక్‌లను 'రెయిన్' 'రోడ్' రైడింగ్ మోడ్లతో లాంచ్ చేసింది. అంతేకాదు ఈ రెండు బైక్‌లలో తొలిసారిగా ప్లాస్టిక్-వెల్డెడ్ ఇంధన ట్యాంకులను అమర్చింది. ఇదే ఆసక్తికరమైన హైలైట్. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రీమియం మోటార్‌సైకిళ్లను భారతదేశానికి తీసుకువచ్చామనీ, మిడ్ రేంజ్ విభాగంలో ఆకర్షణీయమైన విలువతోయూజర్లను ఆకట్టుకుంటాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా యాక్టింగ్ ప్రెసిడెంట్ అర్లిండో టీక్సీరా అన్నారు ఎఫ్ 900 ఆర్ లో 13-లీటర్ ఇంధన ట్యాంక్‌ను, ఎఫ్ 900 ఎక్స్ ఆర్15.5 లీటర్ ట్యాంకును ఇచ్చింది. వీటిల్లో బీఎండబ్ల్యూ మోట్రాడ్ కనెక్టివిటీతో 6.5 అంగుళాల కలర్ టిఎఫ్టి స్క్రీన్‌ను అమర్చింది. ఇంకా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ , యాంటీ-హోపింగ్ క్లచ్ , కాస్ట్ అల్యూమినియం వీల్స్ , ఆల్-ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ లాంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. ఇవి 8500 ఆర్‌పిఎమ్ వద్ద 105 హెచ్‌పి పవర్‌ను, 6500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 92 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తాయి. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగం పుంజుకుంటాయి. గంటకు 200 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. ఈ సూపర్ బైక్‌లు కవా సాకి వెర్సిస్ 1000, డుకాటీ మల్టీస్ట్రాడా 950 వంటి వాటికి గట్టిపోటీ ఇవ్వనున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. -
పొలారిస్ లగ్జరీ బైక్ ‘ రూ.32 లక్షలు
న్యూఢిల్లీ: పొలారిస్ ఇండియా మరో కొత్త లగ్జరీ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అమెరికా లగ్జరీ బైక్ బ్రాండ్ ‘ఇండియన్ మోటార్ సైకిల్’ను ఈ సంస్థ భారత్‌లో విక్రరుుస్తోంది. తాజాగా ఈ బ్రాండ్‌లో ‘ఇండియన్ చెఫ్టెరుున్ డార్క్‌హార్స్’ పేరుతో లగ్జరీ బైక్‌ను రూ.31.99 లక్షల ధర(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)కు అందిస్తోంది. ఈ బైక్‌లో సోలో సీట్, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ క్రూరుుజ్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ ప్రీమియమ్ ఆడియో సిస్టమ్, రిమోట్ కీ తదితర ఫీచర్లు ఉన్నాయని పొలారిస్ ఇండియా సీఈఓ పంకజ్ దుబే చెప్పారు. ఈ కంపెనీ తాజాగా రూ.31 లక్షల ఖరీదుండే ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ క్రూరుుజర్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది.