
ముంబై: జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్యూ మంగళవారం ఆర్ 18 క్లాసిక్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధరను రూ.24 లక్షలు. ఈ బైక్ ఇంజిన్ సామర్థ్యం 1902 సీసీగా ఉంది. ఇందులో 6 గేర్లు ఉన్నాయి. రెయిన్, రోల్, రాక్ మోడ్స్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. పొడవైన విండ్ స్కీన్ ప్యాసింజర్ సీట్, ఎల్‌ఈడీ అదనపు హెడ్ లైట్లు, స్యాడిల్ బ్యాగ్స్ 16-ఇంచ్ ఫ్రంట్ వీల్ తో పాటు ఇంటిగ్రేటెడ్ డిజిటల్ డిస్‌ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ ట్రక్ కంట్రోల్, హిల్ స్వార్డ్ కంట్రోల్. కీలెస్ రైడ్ సిస్టం, ఎలక్రానిక్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ సీబీయూ(కంప్లీట్లే బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా భారత్‌లకి దిగుమతి అవుతుందని, డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని బీఎండబ్య్యూ తెలిపింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment