ఇటీవల గ్లామరస్‌గా ఉండటంపై వ్యామోహం మాములుగా లేదు. ఇదివరకు ఎవరో అక్కడక్కడ అందంపై శ్రద్ధ పెట్టేవారు. అందుకోసమని మరి ఇంతలా ప్రయాస పడేవారు కాదు. కానీ ఇప్పుడూ అందం అనేది అతిపెద్ద స్టేటస్. అందుకోసం ఎంత డబ్బులైనా వెచ్చిచ్చేందుకు వెనకాడటం లేదు. ముఖ్యంగా ఎలాంటి వెర్రిపనులు చేసేందుకైనా సై అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే చాలా విచిత్రమైన సౌందర్య సాధానాలు వస్తున్నాయి. అలాంటి బ్యూటీ ప్రొడక్టే ఈ ఆసియా పక్షి లాలాజల సూప్. అసలు ఏంటిది? పక్షి లాలాజలంతో సూప్ ఎలా చేస్తారు? మంచిదేనా..?
దీన్ని "బర్డ్స్ నెస్ట్ సూప్" అని కూడా అంటారు. చైనా, తైవాన్, హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో చేస్తారు. గట్టిపడిన పక్షి ఉమ్మి గూళ్లతో తయారు చేస్తారు. ఇది వృద్ధాప్య లక్షణాలను దరిచేరనివ్వదు. పైగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీన్ని ఈస్ట్ కేవియర్ అని కూడా పిలుస్తారు.
ఎలా తయారు చేస్తారంటే..
ఇది స్విఫ్ట్‌లెట్స్ అనే పక్షి జాతికి చెందిన తినదగిన గూడు. ఈ పక్షి ఎక్కువగా ఆగ్నేయా తూర్పు ఆసియాలోనే కనిపిస్తుంది. ఈ స్విఫ్ట్‌లెట్స్ పక్షులు తమ లాలాజలంతో గూళ్లను తయారు చేస్తాయి. ఇవి గూళ్లను తయారు చేసేందుకు కొమ్మలు, ఈకలను వినియోగించదు. వీటిని మార్కెట్లో విక్రయిస్తారు. ఆ గూళ్లు ఎరుపు, తెలుపు, బంగారు వర్ణంలో ఉంటాయి.
ప్రతిఒక్క గూడుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలుగా బాగా విశ్వస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా..! అని చర్మ సంరక్షణకు సంబంధించిన పక్షి ఉమ్మి గూడు సూప్ గురించి అందరికీ తెలిసింది. అయితే దీన్ని కొనుగోలు చేయడం అందరివల్ల కాదు. ఎందుకంటే..? 500 గ్రాములే ఏకంగా రూ. 1,60,000/- పలుకుతుంది.
ఈ లాలాజల పక్షి గూళ్లతో తయారు చేసిన కొల్లాజెన్ సప్లిమెంట్స్ కూడా మార్కెట్లో విక్రయిస్తున్నారు. యూఎస్‌లో దీనికి సంబంధించిన గోల్లెన్ నెస్ట్ అనే షాపును 1996లో ఏర్పాటయ్యింది కూడా. ఇక్కడ ఈ పక్షి గూడును ప్రధాన పదార్ధంగా చేసే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
ప్రయోజనాలు..
పోషకాలు సమృద్ధిగా ఉంటాయి
అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి
కణాల పునరుత్పత్తికి, మరమత్తుకు మంచిది
రోగనిరోదక వ్యవస్థను పెంచుతుంది.
అంటువ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుంది
కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని చైనా ప్రజల నమ్మకం. నిజానికి ఇది నిజమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ చైనీస్ ఔషధం ప్రకారం ఈ పక్షి గూడు యవ్వన రూపాన్ని ఇస్తుందనేది ప్రజల నమ్మకం మాత్రమేనని తేల్చి చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు దీనివల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
అవేంటంటే..
పక్షి లాలాజల ప్రోటీన్లు లేదా గూడు కలుషితమైతే అలెర్జీ ప్రతిచర్యలను కలిగి ఉండవచ్చు.
హార్వెస్టింగ్ మరియు ప్రాసెసింగ్ పద్ధతుల రీత్యా పక్షి గూడుని పరిశుభ్రంగా నిర్వహించకపోతే బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల వంటి కలుషితాలను కలిగి ఉండవచ్చు.
ఆ గూళ్లను నిర్మించుకునే వాతావరణాన్ని బట్టి భారీ లోహాలతో కలుషితం అయ్యే ప్రమాదం కూడా ఉంది.
(చదవండి: ప్రపంచంలోనే తొలి మిస్ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో ఇన్‌ఫ్లుయెన్సర్..!)
Comments
Please login to add a commentAdd a comment