Amazing Health Benefits of Cauliflower and Cauliflower Recipes in Telugu - Sakshi
Sakshi News home page

Cauliflower Health Benefits: కాలీఫ్లవర్‌ తింటే ఇన్ని ఉపయోగాలా.. బోర్‌ కొడితే ఇలా ట్రై చేయండి!

Published Fri, Dec 10 2021 3:01 PM | Last Updated on Fri, Dec 10 2021 5:06 PM

Amazing Health Benefits Of Cauliflower: Add To Diet Try These Recipes - Sakshi

Amazing Health Benefits Of Cauliflower: Add To Diet Try These Recipes: పచ్చని ఆకుల మధ్య తెల్లగా చూడముచ్చటగా  కనిపించే  పువ్వే కాలీఫ్లవర్‌.  స్వచ్ఛమైన తెల్లటి వెన్నముద్దలాంటి  ఈ పువ్వులో  పోషకాలకు కొదవే ఉండదు. విడిగా వండినా, ఇతర కూరగాయలతో కలిపి వండినా రుచి మారదు. 

 కాలీఫ్లవర్‌ వల్ల ఎన్ని లాభాలో తెలుసా...?
దంత సమస్యలతో బాధపడేవారు తరచుగా కాలీఫ్లవర్‌ తింటే ఉపశమనం పొందవచ్చు.
కాలీఫ్లవర్‌లో విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువ. మరి క్యాలరీలేమో తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం.


అంతేగాక... కాలీఫ్లవర్‌ కడుపులోని అసిడిటీ కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
బరువు తగ్గాలనుకునే వారు తరచుగా కాలిఫ్లవర్‌ని ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 


అంతేకాదు... కాలీఫ్లవర్‌ రసాన్ని పరగడపునే తాగితే క్యాన్సర్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
అదే విధంగా తరచుగా కాలీఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. 

ప్రస్తుతం మార్కెట్లో విరివిగా  దొరుకుతున్న కాలీఫ్లవర్‌ను వివిధ కాంబినేషన్లతో రుచికరంగా ఎలా వండుకోవచ్చో చూద్దాం... 

గోబీ గోష్‌ కర్రీ...
కావల్సినవి: బోన్‌ లెస్‌ మటన్‌  – ముప్పావు కేజీ;
ఉల్లిపాయలు – రెండు (ముక్కలుగా తరగాలి);
ఆయిల్‌ – ఐదు టేబుల్‌ స్పూన్లు;
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు;
మిరియాలపొడి – అరటీస్పూను;
లవంగాలు – అర టీ స్పూను;
టొమాటోలు – రెండు (ముక్కలు తరగాలి);
ఉప్పు – రుచికి సరిపడా;
ధనియాల పొడి – అరటీస్పూను;
జీలకర్రపొడి – టీస్పూను;
గరంమసాలా పొడి – టీస్పూను;
కారం – టేబుల్‌ స్పూను;
పసుపు – అరటీస్పూను;
పెరుగు – అరకప్పు;
కాలీఫ్లవర్‌ – అరకేజీ;
కొత్తిమీర తరుగు – అరకప్పు;
పచ్చిమిర్చి – నాలుగు.

తయారీ: ముందుగా వేడెక్కిన బాణలిలో ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్‌  బ్రౌన్‌  కలర్‌లోకి మారేంత వరకు వేయించి, కడిగి పెట్టుకున్న మటన్‌  ముక్కలను వేయాలి.
రెండు నిమిషాలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, లవంగాలు వేసి తిప్పాలి.
తరువాత టొమాటో ముక్కలు కూడా వేసి పదినిమిషాలు మగ్గనివ్వాలి ∙ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, పసుపు వేసి బాగా కలపాలి. తరువాత మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి.
తరువాత పెరుగు, కొద్దిగా నీళ్లుపోసి మరో ఐదు నిమిషాలు సిమ్‌లో మగ్గనివ్వాలి ∙మరుగుతున్న నీటిలో కాలీఫ్లవర్‌ ముక్కలు వేసి ఐదు నిమిషాల తరువాత తీసి మటన్‌  మిశ్రమంలో వేసి ఉడికించాలి. ∙ఆయిల్‌ పైకి తేలిన తరువాత, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి దించేయాలి. 

మటర్‌ కాలీ బుర్జి
కావల్సినవి: కాలీఫ్లవర్‌ – ఒకటి; పచ్చిబఠాణి – కప్పు; ఉల్లిపాయ – ఒకటి (ముక్కలు తరగాలి); టొమాటో – ఒకటి (ముక్కలు తరగాలి); పచ్చిమిర్చి – మూడు; అల్లంవెల్లుల్లి పేస్టు – టీస్పూను; పసుపు – పావు టీస్పూను; కారం – టీస్పూను; గరం మసాలా పొడి – అరటీస్పూను; ఆయిల్‌ – ఒకటిన్నరటేబుల్‌ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు. 

తయారీ: కాలీఫ్లవర్‌ను వేడి నీటిలో వేసి పదినిమిషాలు నానబెట్టాలి. ∙పదినిమిషాల తరువాత నీటిని వంపేసి కాలీఫ్లవర్‌ను సన్నగా తరగాలి. ఇప్పుడు వేడెక్కిన బాణలిలో అరటేబుల్‌ స్పూను ఆయిల్, కాలీఫ్లవర్‌ తరుగు వేసి ఐదు నిమిషాలు ఫ్రై  చేసి పక్కనబెట్టుకోవాలి. స్టవ్‌ మీద మరో బాణలి పెట్టి వేడెక్కిన తరువాత టేబుల్‌ స్పూను ఆయిల్‌లో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.∙ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు వేయాలి.
టొమాటో మెత్తబడిన తరువాత బఠాణి, పసుపు, కారం రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి, ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కాలీఫ్లవర్‌ తరుగు వేసి  మూతబెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ∙తరువాత గరం మసాలా పొడి, కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్‌ ఆపేయాలి. 

గోబీ ఫ్రిట్టర్స్‌
కావల్సినవి: కాలీఫ్లవర్‌ – ఒకటి; గోధుమ పిండి – అరకప్పు; గుడ్లు – రెండు (గుడ్డుసొనను కలిపి పెట్టుకోవాలి); వెల్లుల్లి రెబ్బలు – మూడు (సన్నగా తరగాలి); కొత్తిమీర తరుగు – మూడు టేబుల్‌ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – మూడు టీ స్పూన్లు; ఆయిల్‌ – వేయించడానికి సరిపడా; ఫ్రెష్‌ క్రీమ్‌ – గార్నిష్‌కు తగినంత; ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ: ముందుగా మరుగుతున్న నీటిలో కాలీఫ్లవర్‌ వేసి పదినిమిషాలపాటు ఉడికించి, చల్లారనివ్వాలి. చల్లారాక కాలీఫ్లవర్‌ను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. ∙గోధుమ పిండిలో కాలీఫ్లవర్‌ ముక్కలు, గుడ్ల సొన, రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి కలిపి ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన మిశ్రమాన్ని నాన్‌ స్టిక్‌పాన్‌పై చిన్నచిన్న వడల్లా వేసి గోల్డెన్‌  బ్రౌన్‌  కలర్‌ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించాలి. ∙ఈ ఫ్రిట్టర్స్‌ (వడలు) పై క్రీమ్‌ వేసి వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

చదవండి: Health Tips: అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!.. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు.. ఇంకా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement