మగవాళ్లు 35 ఏళ్లు వచ్చేవరకు పవిత్రంగా ఉండాలి: సంపూర్ణేష్‌ బాబు | Sampoornesh Babu About Cauliflower And Upcoming Movies | Sakshi
Sakshi News home page

Sampoornesh Babu: శీలం మగవాళ్లకూ ముఖ్యమే, 35 ఏళ్లు వచ్చేవరకు పవిత్రంగా ఉండాలి

Published Wed, Nov 24 2021 8:41 PM | Last Updated on Wed, Nov 24 2021 9:41 PM

Sampoornesh Babu About Cauliflower And Upcoming Movies - Sakshi

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు సంపూర్ణేష్‌ బాబు. బర్నింగ్‌ స్టార్‌గా పేరు పొందిన సంపూ ప్రస్తుతం ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చసినిమాను నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబరు 26న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హీరో సంపూర్ణేష్‌బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

 ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. పెద్దాయన ఆండ్రిఫ్లవర్.. రెండో పాత్రకు క్యాలీఫ్లవర్ అనిపెట్టారు. క్యాలీఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారని నేనూ అడిగాను.  క్యారెక్టర్ పాత్ర పేరు కూడా అదే.. ఒకానొక సమయంలో అదే కాపాడే కవచంగా మారుతుందని డైరెక్టర్ అన్నారు.

 శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ చెప్పాడు. అది చాలా నచ్చింది. కొత్త చెబుతున్నాడని అనిపించింది. అందుకే ఓకే చెప్పాను.

 ఇందులో కొత్తగా కనిపిస్తాను. కొబ్బరిమట్టలో చెప్పినట్టుగా భారీ లెంగ్తీ డైలాగ్స్ ఉండవు. కోర్ట్ సీన్‌లో మాత్రం అలాంటి డైలాగ్స్ ఉంటాయి.

 35 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని వంశపారంపర్యంగా వస్తుంది. అందుకే అంతవరకు పవిత్రంగా ఉండాలని, ఏ అమ్మాయి కూడా దగ్గరగా వచ్చి మాట్లాడకూడదని, అంత దూరంలో ఉండాలని ఆ స్కేల్ వాడాం.

 ఈ సినిమాలో గెటప్స్ బాగా సెట్ అయ్యాయి.. హీరో రేప్‌కు గురవ్వడం, ఆ తరువాత వచ్చే పాటలు ఇలా అన్నీ బాగుంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకే హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల్లా అందరికీ నచ్చుతుందని అన్నాను.

 డైరెక్టర్ ఆర్కే ఇంతకు ముందు సీరియల్స్ చేశారు. ఈ కథను ఎప్పటి నుంచో అనుకున్నారట. ఈ పాత్ర అలా ఉండాలి.. ఇలా ఉండాలని అనుకున్నారట. సంపూర్ణేష్ బాబు అయితే బాగుంటుందని అనుకున్నారట. అలా నా వద్దకు వచ్చి కథ చెప్పారు.

 హీరోయిన్ వాసంతి ఇది వరకు కన్నడలో సీరియల్స్ చేశారు. తనకు ఇదే మొదటి తెలుగు సినిమా. అయినా కూడా చక్కగా నటించారు. పల్లెటూరిలో చలాకీగా తిరుగుతూ, బావను ఏడిపించే మరదలి పాత్రలో కనిపిస్తారు.

 నేను ఎంత అతి చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కథలు రాస్తుంటారు. హ‌ృదయ కాలేయంలో చితిలోంచి లేచి రావడం, కొబ్బరిమట్టలో కొడితే సుమో చేతిలోకి వస్తుంది. అది పరాకాష్ట. సింగం 123 సినిమాలో ఇంట్లో స్మిమ్మింగ్ పూల్‌లో దూకితే ఎక్కడెక్కడో తేలుతాను.

 ఈ రోజు సంతోషంగా ఉన్నామా? రేపు మంచిగా ఉంటామనే నమ్మకం ఉందా? అనే ఆలోచిస్తాను. నటుడిగా ఏం చేయడానికైనా రెడీ. ఏ పాత్రలు వస్తే అవి చేస్తాను.

 హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నాను. అందుకే గెస్ట్ అప్పియరెన్స్ ఎక్కువగా చేయలేకపోతోన్నాను. ఒక సినిమాలో ఓ కారెక్టర్ వేశాను. గోల్డ్ మ్యాన్ సినిమా చేద్దామనుకున్నాను. కానీ కరోనా వల్ల వెనక్కి వెళ్లిపోయింది.

 నరసింహాచారి నుంచి సంపూగా ఎదగడం, ఆటోలో తిరగడం నుంచి ఫ్లైట్‌లో తిరిగే స్థాయి వరకు వచ్చాను. అదే నాకు సంతోషం. ప్రస్తుతం నా చేతిలో ఐదు సినిమాలు ఉండటం అదృష్టం.

 ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేయడం నాకు ఆనందంగా ఉంటుంది. తెలియని సంతృప్తినిస్తుంది.

 తమిళంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. స్టోరీ బేస్డ్ సినిమా. సీరియస్‌గా సాగుతుంది.

 సాయి రాజేష్ గారు ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత మేం మళ్లీ ఓ సినిమా చేస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement