![Sampoornesh Babus Cauliflower Gets Release Date - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/17/cauli.gif.webp?itok=lZ3xQIO0)
‘‘ఓ మహిళ వల్ల శీలం పోగొట్టుకున్న ఒక మగాడు న్యాయం కోసం చేసే పోరాటమే ‘క్యాలీ ఫ్లవర్’ కథ’’ అని సంపూర్ణేష్ బాబు అన్నారు. ఆర్కే మలినేని దర్శకత్వంలో సంపూర్ణేష్, వాసంతి జంటగా తెరకెక్కిన చిత్రం ‘క్యాలీ ఫ్లవర్’. గూడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది.
విలేకరుల సమావేశంలో సంపూర్ణేష్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకుల్ని నవ్వించేందుకు ఆర్కే మలినేని శాడిజాన్ని చూపించి నాలోని నటుణ్ణి బయటకు తీసుకొచ్చారు. ఈ సినిమా హిట్ అయితే దానికి కారణం ప్రేక్షకులు.. తేడా కొట్టిందంటే నా వల్లే’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి.
Comments
Please login to add a commentAdd a comment