సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ . గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌పై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘క్యాలీఫ్లవర్’ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ గురించే చర్చ. ‘అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్’ వీడెవడే ఒక్కరోజులో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు’అనే డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఇక సంపూ చెప్పే డైలాగ్స్ అయితే నవ్వులు పూయిస్తున్నాయి.
‘ఈ ఊర్లో పుట్టిన మనిషితో పాటు జంతువుకు అందరికీ ఒక్కటే భర్త, ఒక్కటే భార్య ఇదే ఈ క్యాలీఫ్లవర్ రూల్’అని సంపూ అంటుండగా.. అక్కడే ఉన్న ఓ గేదె ‘ఏం కర్మరా బాబు.. నాక్కుడా ఒక్కడే మొగుడు అట’అని చెప్పడం ఫన్నీగా ఉంది. మొత్తంగా ఎనీ టైమ్ శీలాన్ని కాపాడే సింబలేరా.. క్యాలీఫ్లవర్ అంటూ సంపూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.
Cauliflower: ఎనీ టైమ్ శీలాన్ని కాపాడే సింబల్ యేరా ఈ కాలీఫ్లవర్!
Published Sat, Nov 20 2021 3:51 PM | Last Updated on Sat, Nov 20 2021 3:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment