కొన్ని పురాతన వస్తువులు చాలా విచిత్రంగా బయటపడతాయి. పురావస్తు శాస్త్రవేత్తలకు చిక్కని కొన్ని మిస్టీరియస వస్తువులు సాధారన కూలీలకు లేదా భవన నిర్మాణ కార్మికులకు కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పాపం వారు అదేదో సాధారణ వస్తువుగా పరిగణిస్తారు. అదికారులకు చెంతకు చేరే వరకు అదేంటన్నది తెలియదు. అలాంటి విచిత్ర ఘటన యూకేలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..ఇంగ్లండ్‌లోని లింకన్ షైర్ కౌంటీలో ఉన్న 16వ శతాబ్దపు పురాతన భవనం బర్గ్లీ హౌస్ పార్కింగ్ స్థలంలో నిర్మాణ పనులు చేస్తుండగా పాలారాతి శిల్పం కనిపించింది. అదేదో రాయిగా భావించానని గ్రెగ్ క్రాలే అనే కార్మికుడు చెబుతున్నాడు. దాన్ని ఒక బకెట్లో పెడుతుండగా తిరగబడటంతో అది విగ్రహం తల అని అర్థమయ్యింది. దాన్ని అధికారుల వద్దకు తీసుకెళ్లి చూపగా అది పురాతన రోమన్ విగ్రహమని చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని అన్నాడు క్రాలే. చాలా ప్రత్యేకమైనది, పురాతనమైనదని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు క్రాలే. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ విగ్రహం మెండెం భాగం కూడా లభించింది.
ఆ తర్వాత తలను, మెండెంను దగ్గరకు చేర్చి అసలు రూపంలోకి మార్చారు నిపుణులు. ఇది మొదటి లేదా రెండో శతాబ్దానికి చెందిన పురాతన విగ్రహ అవశేషాలుగా చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్ధే ప్రక్రియలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇలాంటి పురాతన ప్రతిమలను ఇటలీలో గ్రాండ్ టూర్ అని పిలిచే కులీనులే తయారు చేస్తారని, ఆ ప్రతిమ చెక్కిన తీరులో అది కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు దీన్ని 9వ ఎర్ల్ తన గ్రాండ్ టూర్ ఆఫ్ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఈ శిల్పాన్ని బర్గ్లీకి తీసుకువచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment