
ముంబై: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే మాట మరోమారు రుజువైనట్టు కనిపిస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఇరిగేషన్ స్కాంపై అజిత్ పవార్ జైలుకెళ్లక తప్పదని శపథాలు చేసిన ఫడ్నవీస్ తాజాగా అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, తాను సీఎంగా ప్రమాణ స్వీకారంచేశారు. దీంతో 2014లో ఫడ్నవీస్ అజిత్‌పవార్‌ను ఉద్దేశించి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఎన్సీపీని ‘నేచురల్లీ కరప్ట్ పార్టీ’గా అభివర్ణించిన మోదీ ప్రస్తుతం ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment