డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సీఎం ఫడ్నవిస్ వ్యాఖ్య
నాగ్‌పూర్: మీరు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌నుద్దేశిస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యా ఖ్యానించారు. గురువారం నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలనుద్దేశిస్తూ గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం ఫడ్నవిస్ మాట్లాడారు. సభలో ఉన్న అజిత్ పవార్, మరో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేలనుద్దేశిస్తూ ప్రసంగించారు.
‘‘ తెల్లవారుజామునే నిద్రలేచే అజిత్ పవార్ అప్పట్నుంచే ప్రజాసేవకు అంకితమవుతారు. ఫైళ్లు తిరగేస్తారు. నేను మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి పని మొదలుపెడతా. అయితే ఏక్‌నాథ్ షిండే మాత్రం అర్ధరాత్రిదాకా పనిచేస్తారు. చాన్నాళ్లుగా డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అజిత్ పవార్‌కు ‘శాశ్వత ఉపముఖ్యమంత్రి’ పేరు స్థిరపడిపోయింది. కానీ నేను మాత్రం ఒక్కటే ఆశిస్తున్నా. అజిత్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారు’’ అని ఫడ్నవిస్ అన్నారు.
ఎన్సీపీ చీఫ్ అయిన అజిత్ పవార్ ఈనెల ఐదో తేదీన ఆరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. ఎప్పట్నుంచో ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన అజిత్ ఆ లక్ష్యసాధనలో భాగంగా బాబాయి శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన విషయం విదితమే. పార్టీని చీల్చినా సరే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనవైపే రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్సీపీ పార్టీ గుర్తు, ఎన్నికల చిహ్నం రెండూ అజిత్‌కే దక్కాయి. ఇటీవల లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అజిత్ వర్గమే అత్యధిక స్థానాల్లో గెలిచి తమదే అసలైన ఎన్సీపీ అని నిరూపించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment