సాక్షి ముంబై: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్.. ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా సహా.. బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ఎవరెవరిని మంత్రి పదవులు వరించనున్నాయనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఇలా ముగ్గురే ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రి పదవులపై సస్సెన్స్ కొనసాగుతోంది. అయితే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి సుమారు 20 నుంచి 25 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా.. శివసేన (షిండేే) పార్టీకి సుమారు 10 నుంచి 12 అదేవిదంగా ఎన్సీపీ (ఏపీ)కి 8 నుంచి 10 మంత్రి పదవులు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల ఆశిస్తున్న వారందరు లాబీ యింగ్ ప్రారంభించారు.
ఇదిలా ఉండగా తాను ముఖ్య మంత్రిని కానందుకు మనస్తాపానికి గుర య్యానన్న మాటలను మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి షిండే కొట్టిపారేశారు. 2022లో శివసేనను నుంచి బయటకు వచ్చినపుడు తనవెంట ఉన్నది 39 మంది ఎమ్మెల్యేలని, నేడు, పార్టీకి 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అసలు శివసేన ఎవరిదో దీన్ని బట్టే తెలి సిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకా రోత్సవం అనంతరం శివసేన ప్రధాన కార్యా లయం ఆనంద్ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ఆయన్ను స్వాగతించారు.
<
Comments
Please login to add a commentAdd a comment