మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకోవడంతో రెండు రాష్ట్రాల అధికారులు కలవరపాటుకు గురయ్యారు.
రాజ్కోట్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకోవడంతో రెండు రాష్ట్రాల అధికారులు కలవరపాటుకు గురయ్యారు. రాజస్థాన్ లోని రాజ్ కోట్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ ఆథ్యాత్మిక క్షేత్రం పరబ్ వావధికి హెలికాప్టర్ లో బయలుదేరారు.
అయితే టేకాఫ్ అయిన తర్వాత సీఎం హెలికాప్టర్ కు ప్రతికూల వాతావరణం ఎదురు కావడంతో 15 నిమిషాలకే వెనక్కితిరిగి వచ్చేసింది. దీంతో అధికారులు కలవరపడ్డారు. మరో 20 నిమిషాల అనంతరం సీఎం ఫడ్నవిస్ అదే హెలికాప్టర్ లో గమ్యానికి సురక్షితంగా చేరుకున్నారు.