ఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచే సీఎం పదవి ఖరారు కావడం మహాయుతి కూటమిలో చిచ్చురాజేసిందనే చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ నిర్ణయంపై ఏక్‌నాథ్ షిండే అసమ్మతితో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కూటమిలో ఉన్న కారణంగా బయటకు ఆయన ఒకే చెబుతున్నా.. లోలోపల మాత్రం తీవ్ర కలత చెందారని పలువురు కామెంట్స్ చేశారు.
మహారాష్ట్రలో ఉత్కంఠ కొనసాగుతున్న వేళ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే.. ఏక్‌నాథ్ షిండేపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అథవాలే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీజేపీ నిర్ణయంతో షిండే కలత చెందారన్నది వాస్తవమే. అయినప్పటికీ బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు. ఇప్పటికే రెండున్నరేళ్లపాటు ఆయన సీఎంగా కొనసాగారని గుర్తు చేశారు.
అయితే, గతంలో మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయిన సమయంలో బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ సీఎం పీఠాన్ని షిండేకు అప్పగించారు. అప్పుడు అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొనసాగారు. కానీ, ఇప్పుడు సీఎం పదవిని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే.. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడంతోపాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇది సరైన సమయమని హైకమాండ్ భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ కారణంగానే మహారాష్ట్ర సీఎం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో షిండే ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం మంచిదని సూచించారు. లేదంటే మహాయుతి కూటమి చైర్మన్‌గా.. అది కూడా నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వంలో స్థానం కోరుకోవడమే తన ముందున్న మార్గం అంటూ సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
ఇదిలా ఉండగా.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక, ఈనెల 5న సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఇప్పటికే బీజేపీ నేతలు లీకులు ఇచ్చారు.
#WATCH | Delhi: On the question of Maharashtra CM, Union Minister Ramdas Athawale says, "I believe in the meeting that is going to take place tomorrow, BJP observers will listen to all the MLAs and the name of Devendra Fadnavis can be announced tomorrow...Eknath Shinde does not… pic.twitter.com/52QJ0bMn07
— ANI (@ANI) December 3, 2024
Comments
Please login to add a commentAdd a comment