
ముంబయి:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం,బీజేపీ సీనియర్‌నేత దేవేంద్ర ఫడ్నవిస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం(నవంబర్23) మీడియాతో మాట్లాడారు.
‘మహాయుతి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ముఖ్యంగా మహిళా ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు మహారాష్ట్ర అంతా ఒక్కటిగా ఉంది.మహారాష్ట్ర మొత్తం మోదీ వెంట నిలిచింది. సీఎం పదవిపై మహాయుతి కూటమిలో ఎలాంటి గొడవ లేదు.పరస్పర అంగీకరాంతో సీఎంను ఎన్నుకుంటాం.
షిండే శివసేననే అసలు శివసేన అని ప్రజలు తీర్పిచ్చారు. ఈవీఎంలు ఒక్క మహారాష్ట్రలోనే ఎలా ట్యాంపర్ అవుతాయో ఝార్ఖండ్‌లో ఎందుకవవో విపక్షాలే చెప్పాలి’అని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment