‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’ | Anil Kapoor Fans Says Should Take Charge As Maharashtra CM | Sakshi
Sakshi News home page

‘అనిల్‌ కపూర్‌ను మహారాష్ట్ర సీఎం చేయండి’

Oct 31 2019 11:53 AM | Updated on Oct 31 2019 12:14 PM

Anil Kapoor Fans Says Should Take Charge As Maharashtra CM  - Sakshi

ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి అత్యధిక సీట్లు దక్కించుకున్న విషయం తెలిసందే. అయితే గత ఎన్నికలతో పోలిస్తే రెండు పార్టీలకు సీట్లు తగ్గినప్పటికీ తమకు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి కేటాయించాలంటూ శివసేన పట్టుబడుతోంది. మరోవైపు శివసేన డిమాండ్‌కు తలొగ్గని బీజేపీ.. సీఎం పీఠం తమదేనని స్పష్టం చేసింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న ఈ ప్రతిష్టంబన సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా బాలీవుడ్‌ సుపర్‌ స్టార్‌ అనిల్‌ కపూర్‌ సీఎంగా ఉండాలంటూ ఆయన అభిమానులు ట్విటర్‌ ద్వారా కామెంట్లు చేస్తున్నారు. కాగా 2001లో విడుదలైన ‘నాయక్‌’ సినిమాలో అనిల్‌ కపూర్‌ నటించిన ఒకరోజు సీఎంగా నటించిన విషయం తెలిసిందే. దీంతో అదే తరహలో నిజ జీవితంలో కూడా మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయం తేలే వరకు ఆయనను సీఎంగా ఉండమంటూ.. ఈ విషయం గురించి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌, అదిత్య ఠాక్రే ఓసారి ఆలోచించాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కోరుతున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన అనిల్‌ కపూర్‌.. ‘ నేను నాయక్‌లో మంచి నటుడిని మాత్రమే’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు.
 

దీంతో ఆయన అభిమానులు ‘హ హ్హ హ్హా సినిమాలో కూడా మొదట నిరాకరించి ఆ తర్వాత సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారంటూ’  అప్పటి నాయక్‌ సినిమాలోని ఆయన పాత్రను గుర్తు చేశారు. ఇక తమిళ దర్శకుడు ఎస్ శంకర్‌ దర్శకత్వంలో వహించిన నాయక్‌(ఒకే ఒక్కడు రీమేక్‌)లో అనిల్‌ కపూర్‌తో పాటు రాణి ముఖర్జీ, అమ్రిష్‌ పురిలు ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది అనిల్‌ కపూర్‌ ఈ ఏడాది ‘ఏక్‌ లడ్కీ కో దేఖా ఐసేహీ హోగా’, ‘టోటల్‌ ధమాల్‌’లో చిత్రాలలో ప్రేక్షకులను అలరించారు. అలాగే కరణ్‌ జోహర్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘తఖ్త్‌’లో కూడా ఆయన నటిస్తున్నారు. కాగాఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement