ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయ దుందుభి మోగించింది. మొత్తం 288 స్థానాల్లో అధికార బీజేపీ 229 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కేవలం 54 స్థానాలకే పరిమితమైంది
ఈ తరుణంలో కాబోయే మహరాష్ట్ర సీఎం ఎవరనేది ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తమ కుమారుడే మహరాష్ట్ర సీఎం అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ప్రజల కోసం తన కుమారుడు 24 గంటలూ కష్టపడుతున్నారని మీడియాతో పేర్కొన్నారు.
మరోవైపు, మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆమె తల్లి సరితా ఫడ్నవీస్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోన్ కాల్‌లో ‘ఎన్నికల తతంగం పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తా అమ్మా. మీతో అన్నీ మాట్లాడుతాను. మీరు నన్ను ఆశీర్వదించండి’ అని అన్నారనేది ఆ ఫోన్ కాల్ సారాంశం.
కాగా,ప్రస్తుతం విడుదలైన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 124 స్థానాల్లో ముందంజలో ఉంది. 144 స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. మహాయుతి కూటమిలోని ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 56, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 19 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. శివసేన(యూబీటీ) 18, శరద్ పవార్ ఎన్సీపీ 15 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
#WATCH | As Mahayuti is set to form govt in Maharashtra, Deputy CM Devendra Fadnavis' mother, #SaritaFadnavis says, "Of course, he will become the CM...It is a big day as my son has become a big leader in the state. He was working hard at all 24 hours..."#ElectionResults… pic.twitter.com/MV36KVSyJe
— TIMES NOW (@TimesNow) November 23, 2024
Comments
Please login to add a commentAdd a comment