నాందేడ్: ఇప్పటికే తెలంగాణా,కర్ణాటక రాష్ట్రాలలో సంచలన విజయాలు నమోదు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలోనూ భాగ స్వామ్య పక్షాలతో కలిసి విజయం సాధించి దక్షిణాదిలో బీజేపీ దూకుడుకు ముకుతాడు వేసేందుకు గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టింది.
భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు అంశంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.ఈ మేరకు ఏఐసీసీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సచిన్ పైలెట్‌లు బుధవారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించి నాయకులు, పార్టీ శ్రేణులకు ఎన్నికల రూట్ మ్యాప్‌పై దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేలా కృషిచేయాలంటూ వారికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment