నేను అస్సలు ఊహించలేదు.. ‘మహా’ ఎన్నికల ఫలితాలపై రాహుల్‌ గాంధీ | Maharashtra results unexpected, says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

నేను అస్సలు ఊహించలేదు.. ‘మహా’ ఎన్నికల ఫలితాలపై రాహుల్‌ గాంధీ

Published Sat, Nov 23 2024 8:06 PM | Last Updated on Sat, Nov 23 2024 8:06 PM

Maharashtra results unexpected, says Rahul Gandhi

ఢిల్లీ : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని తాను ఊహించలేదని అన్నారు కాంగ్రెస్‌ అగ​నేత రాహుల్‌ గాంధీ. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. మహాయుతి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ 288 స్థానాల్లో ఏకంగా 130 స్థానాల్లో విజయం సాధించింది. ఇతర మిత్ర పక్షాలతో కలిసి మెజార్టీని సాధించారు. దీంతో రెండోసారి మహాయతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఈ తరుణంలో మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. మహరాష్ట ఫలితాల్ని నేను ఊహించలేదు. ఓటమిని అంగీకరిస్తున్నాం. ఓటమికి గల కారణాల్ని విశ్లేషిస్తామని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ పార్టీకి మద్దతిచ్చిన ఓటర్లకు, సోదరీమణులందరికీ, పార్టీ గెలుపుకోసం కృష్టి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు’అని అన్నారు. 

మరోవైపు జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలపై రాహుల్‌ గాంధీ ప్రశంసలు కురిపించారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూమి రక్షణ విజయం’అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు.  

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో హేమంత్‌ సోరెన్‌ నేతృత్వం వహిస్తున్న జేఎంఎం 34 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌ నిలించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement