నాటు నాటు పాటను ప్రపంచమే మెచ్చింది. 78 ఏళ్లుగా ఇస్తున్న హాలీవుడ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో భారత్ నుంచి, అందులోనూ తెలుగు నుంచి మొట్టమొదటిసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాట అవార్డు గెలుచుకుంది. దీంతో యావత్ దేశం చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు చెప్తోంది. ఇదే సమయంలో కొందరు నాటు నాటు పాట వెగటు పుట్టిస్తోందని వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. ఇదేం పాటరా బాబూ అంటూ వెకిలిగా నవ్వుతున్నారు.
పనీపాటా లేక ఇలాంటి విమర్శలు చేస్తున్నవారిపై సెలబ్రిటీలు మండిపడుతున్నారు. 'నాటు నాటు పాట చప్పగా ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అయితే మరీ యావరేజ్‌గా ఉంది. అందులో వచ్చే యాస అయితే మరీ ఘోరం అని కొందరు పకపకా నవ్వుతున్నారు. మీరు చిన్నప్పటినుంచి మరీ అంత బాధలో ఉన్నారా? కనీసం పక్కవారి సంతోషాన్ని చూసి ఓర్వలేరా?' అంటూ రచయిత అనిరుధ గుహ ట్విటర్ వేదికగా ఫైరయ్యారు. 'ఒకరి బాధను చూడగలరేమో కానీ వారి సంతోషాన్ని చూసి తట్టుకోలేకపోవడం మానవ నైజం కదా!' అంటూ సెటైర్ వేసింది పూజా భట్.
Insaan ki fitrat hai ke woh apna dukh jhel leta hai par doosron ka sukh bardaashth nahin kar sakta 🙏 https://t.co/cbTAEcIIrP
— Pooja Bhatt (@PoojaB1972) January 12, 2023
చదవండి: నాకసలు ఫ్యాన్స్ ఉన్నారా? అందుకే సినిమాలు చేయట్లే: నటుడు
పూజారి మాస్ డ్యాన్స్, వీడియో చూశారా?
Comments
Please login to add a commentAdd a comment