![Pooja Bhatt: Mom Locked Dad Mahesh Bhatt in Bathroom When He Drunk - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/3/pooja-bhatt.jpg.webp?itok=l6Nh4ScW)
కొందరు సెలబ్రిటీలు ఏ విషయాన్నైనా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవాలనుకుంటారు. మరికొందరు మాత్రం అన్నింటినీ గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతారు. కానీ బాలీవుడ్‌లోని భట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం మొదటి కోవకే చెందుతారు. తమ జీవితంలో జరిగిన సంఘటనలను కూడా నిర్మొహమాటంగా బయటకు చెప్తుంటారు. ఇందుకు బాలీవుడ్ నటి, దర్శకురాలు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ పూజా భట్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంఘటనే ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇంతకీ పూజా భట్ దేని గురించి మాట్లాడిందంటారా? తన తండ్రి తాగినప్పుడు తల్లి ఎలా రియాక్ట్ అయిందో తెలిపింది. 'ఒక రోజు రాత్రి నాన్న తాగి తూలుతూ వచ్చాడు. దీంతో అమ్మ అతడిని బాత్రూమ్‌లో ఉంచి గడియ పెట్టింది. ఇది చూసి నేను బెడ్‌పైనే ఏడ్చుకుంటూ ఎందుకు నాన్నను బంధించావని అడిగాను. వెంటనే అమ్మ నువ్వు నాన్న పార్టీనా? నా పార్టీనా? అని అడిగింది. ఇది టూమచ్ అనుకున్నా. కానీ సైడ్ తీసుకోవాల్సి వస్తే తప్పకుండా నాన్నవైపే వెళ్తాను' అని కుండ బద్ధలు కొట్టేసింది. ఎప్పుడూ నాన్నసైడ్ నిలబడుతున్నందుకు తన సోదరుడు మహేశ్ భట్ చెంచా అని ఆటపట్టించేవాడని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment