దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఒక ఫోటో షూట్ గురించి తాజాగా బాలీవుడ్ నటి పూజా భట్ స్పందించారు. దాదాపు 33 ఏళ్ల క్రితం తన తండ్రి, దర్శకుడు మహేశ్ భట్‌తో కలిసి ఆమె ముద్దు పెట్టుకున్నారు. అప్పట్లో సినిమా కోసం చేసిన ఆ ఫోటో షూట్ స్టార్ డస్ట్ మ్యాగజైన్ కవర్ పేజీపై వచ్చింది. తండ్రీకూతుళ్లు ఇలా ఎప్పుడూ ముద్దుపెట్టుకోరని, అది అసహజమని వీరిద్దరినీ తప్పుబడుతూ ఎంతోమంది ఆరోజుల్లో పలు విమర్శలు చేశారు.
అంతేకాకుండా పూజా తన కూతురు కాకపోతే పెళ్లి చేసుకునేవాడినని మహేష్ భట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పూజ పట్ల మహేష్ భట్‌కు తండ్రి భావాలు లేవని కూడా పలువురు విమర్శించారు. దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన ఈ సినిమాపై ఇప్పుడు పూజా భట్ స్పందించారు. ఆ ఫోటో షూట్‌లో పాల్గొన్నందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదని ఆమె అన్నారు. ఆ సమయంలో తమ ఉద్దేశం మంచిదే కానీ చూసేవాళ్లే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పూజా భట్ తెలిపారు.
(ఇదీ చదవండి: కేఎల్ రాహుల్ సెంచరీ.. భావోద్వేగానికి గురైన అతియా)
'దురదృష్టవశాత్తూ ఆ ఫొటోలను కొంతమంది వేరేలా అర్థం చేసుకున్నారు. ఆ ఫొటోషూట్‌పై విమర్శలు వచ్చిన సమయంలో షారుఖ్ ఖాన్ చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. పిల్లలు చిన్నప్పుడు.. తమ తల్లిదండ్రులను ఇలాగే ముద్దుపెట్టుకుంటారు. ప్రజలు తమకు తోచినది చెబుతారు. పర్వాలేదు, పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులు వాళ్లను చిన్నవాళ్లగానే చూస్తారని ఆయన నాతో అన్నారు. నిజం చెప్పాలంటే, ఈ వయసులోనూ నా తండ్రి నన్ను ఒక చిన్న పాపలానే చూస్తారు.' అని ఆమె తెలిపారు.
ఈ ఫొటోషూట్ జరిగినప్పుడు సమాజం గురించి తనకు పెద్దగా తెలియదని పూజా భట్ చెప్పారు. ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే ప్రజలు తమకు నచ్చిన విధంగా చూస్తుంటారు. అది సహజమేనని ఆమె చెప్పుకొచ్చారు. తండ్రీకుమార్తెల మధ్య అనుబంధాన్ని వాళ్లు వేరేలా చూడాలనుకుంటే.. ఎవరమైనా ఏం చేస్తామని ఆమె ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment