సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌లో మొదలైన నెపోటిజం గొడవ రోజులు గడుస్తున్న ఇంకా చల్లబడటం లేదు. నెపోటిజం గురించి బయటకి వచ్చి బహిరంగంగానే స్టార్స్ కిడ్స్‌ని, మహేష్ భట్, కరన్‌జోహార్ లాంటి నిర్మాతలను విమర్శించిన వారిలో కంగనా రనౌత్ ముందంజలో ఉన్నారు. ఇక నెపోటిజానికి సంబంధించి సోషల్‌మీడియా వేదికగా మహేష్ కుమార్తె పూజా భట్‌కు, కంగనా రనౌత్‌కు మాటల యుద్దం నడుస్తూనే ఉంది. 2006 ఫిల్మ్ ఫేర్ అవార్డు కార్యక్రమంలో గ్యాంగ్‌స్టర్ సినిమాలో నటించినందుకు గాను కంగనా బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కంగనా మహేష్ భట్‌కు ధన్యవాదాలు తెలిపింది.
(ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు)
తాజాగా పూజాభట్ ఈ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘ఈ వీడియోలు కూడా అబద్ధమా? నేను ఆరోపణలను వారికే వదిలేస్తున్నాను, నేను వాస్తవాలను మీ ముందుంచాను’ అని పూజా తన పోస్ట్‌కు శీర్షికను పెట్టారు. తన కుటుంబం మీద వస్తున్న నెపోటిజం ఆరోపణలపై స్పందించిన పూజా... విశేష్ ఫిల్మ్ ఒకప్పుడు కొత్తవారితో మాత్రమే పనిచేసినందుకు అపఖ్యాతి పాలైందని గుర్తుచేశారు. ఇక దీనిపై స్పందించిన కంగనా రనౌత్ సోషల్ మీడియా టీం మహేష్ భట్ ప్రొడక్షన్ హౌస్ నటుల కోసం అంత ఎక్కువగా డబ్బు ఖర్చు చేయదని పేర్కొంది. కంగనా లాంటి టాలెంట్ ఉన్న వారు తక్కువ డబ్బులకు చేయడానికి దొరకడంతో మహేష్ భట్ ఆమెకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మొత్తం మీద సోషల్‌మీడియా వేదికగా పూజా భట్-కంగనాల వివాదం రోజురోజుకు ముదురుతోంది.
Comments
Please login to add a commentAdd a comment