అవును... మేమిద్దరం విడిపోయాం! | Pooja Bhatt separates from husband Manish Makhija after 11 years of marriage | Sakshi
Sakshi News home page

అవును... మేమిద్దరం విడిపోయాం!

Published Mon, Dec 8 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

అవును... మేమిద్దరం విడిపోయాం!

అవును... మేమిద్దరం విడిపోయాం!

 పూజా భట్ ఆలోచనా ధోరణి అందరికన్నా భిన్నంగా ఉంటుంది. ఏ విషయాన్నయినా సూటిగా, సుత్తి లేకుండా చెబుతారు. చివరకు తన విడాకుల విషయం కూడా. తన భర్త మనీష్ మఖీజా నుంచి విడిపోయిన విషయాన్ని సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. ‘‘నా భర్త మున్నా, నేను మా పదకొండేళ్ల వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేశాం’’ అని పూజా పేర్కొన్నారు.

ఇంకా చెబుతూ -‘‘మేమిద్దరం పబ్లిక్ పర్సనాల్టీస్ కాబట్టే, విడిపోయిన విషయాన్ని బహిరంగంగా చెప్పేశాను. ఇద్దరం పరస్పర అవగాహనతోనే విడిపోయాం. విడిపోవడానికి గల కారణాలు చెప్పాల్సిన అవసరంలేదనిపిస్తోంది. కానీ, ఎవరిష్టం వచ్చిన రీతిలో వాళ్లు ఊహించుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు’’ అని పూజ అన్నారు. వ్యక్తిగతంగా విడిపోయినప్పటికీ, వృత్తిపరంగా మాత్రం ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేస్తారు. ప్రస్తుతం పూజా భట్ ‘కాబరెట్’ అనే చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మనీష్ మఖీజానే సంగీతదర్శకుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement