![Sadak 2 Releasing On 28 August On Disney Plus Hotstar - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/11/Sadak2-alia-bhatt-Sanjay.jpg.webp?itok=LahQV8Rf)
ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సడక్ 2’. ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్, పూజా భట్ కీలక పాత్రలు చేశారు. తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటించిన చిత్రమిది. 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘సడక్’కి ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఆలియా, సంజయ్ దత్ లుక్స్‌ను విడుదల చేశారు. నేడు ‘సడక్ 2’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూతపడటం, ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు యూనిట్ మొగ్గుచూపింది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈనెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
Comments
Please login to add a commentAdd a comment