Sadak
-
ముగ్గురు స్టార్స్, పరమ చెత్త సినిమాగా రికార్డ్.. థియేటర్లలో నో రిలీజ్!
కొన్ని సినిమాలు అద్భుతంగా ఆడతాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాప్‌గా నిలుస్తాయి. భారీ తారాగణం, భారీ బడ్జెట్ ఉన్నా సరే కంటెంట్‌లో దమ్ము లేకపోతే ప్రేక్షకులను మెప్పించడం కష్టం. ఇప్పుడు చెప్పుకునే సినిమా అదే కోవలోకి వస్తుంది. సడక్.. 1991వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇదీ ఒకటి. మహేశ్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంజయ్‌దత్, పూజా భట్ ప్రధానపాత్రల్లో నటించారు. రెండు దశాబ్దాలకు సీక్వెల్ఐదింతలు లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాకు రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ ప్రకటించారు. సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్.. ఇలా బడా స్టార్స్‌తో 2020లో సీక్వెల్ తీసుకొచ్చారు. అయితే సడక్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో సడక్ 2 మూవీని అంతే స్థాయిలో తిప్పికొట్టారు. యూట్యూబ్‌లో ట్రైలర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 70 లక్షలమంది డిస్లైక్ కొట్టారు.నేరుగా ఓటీటీలో రిలీజ్తీరా సినిమాకు థియేటర్లు దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి ఐఎమ్‌డీబీలోనూ అత్యంత దారుణమైన రేటింగ్స్ ఉన్నాయి. కేవలం 1.2 రేటింగ్ ఉంది. అంతేకాదు, ఓటీటీలో రిలీజైన రెండు రోజులకే సడక్ 2 వంద అత్యంత చెత్త చిత్రాల్లో ఒకటిగా చేరిపోవడం గమనార్హం.ముఖ్య కారణం!కాగా సడక్ 2పై అంత వ్యతిరేకత రావడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఈ మూవీ రిలీజైన ఏడాదే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాలీవుడ్‌లోని నెపోటిజమే అతడి ప్రాణాలు తీసిందని జనాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ కారణం వల్లే బాలీవుడ్ బడా స్టార్స్ కలిసి నటించిన సడక్ 2 సినిమాకు యూట్యూబ్‌లో లక్షల్లో వచ్చిపడ్డాయి. చదవండి: Pushpa 2 Movie: నార్త్‌లో పుష్ప 2 దూకుడుకు బ్రేక్? -
18 ఏళ్లకే ఫస్ట్ కిస్, నాన్న ప్రోత్సాహంతోనే: పూజా భట్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కూతురు పూజా భట్ 18 ఏళ్లకే తన ఫస్ట్ కిస్ అనుభవాన్ని చుశానని పేర్కొన్నారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేరీర్ ప్రారంభంలోని సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నటించిన ‘సడక్’ చిత్రంలోని ఓ ముద్దు సన్నివేశం గురించి వివరించారు. ఆ సీన్లో నటించేందుకు తను ఇబ్బంది పడుతుంటే తన తండ్రి(మహేష్ భట్) దగ్గరుండి ఆ సన్నివేశాన్ని చేయించారన్నారు. ‘సడక్ మూవీ చేస్తున్న సమయానికి నాకు 18 ఏళ్లు. ఈ సినిమాలో ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు భయంతో వణికిపోయాను. నాన్న ముందు ఆ సీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. దీంతో నాన్న నన్ను పక్కకు తీసుకెళ్లి నువ్వు ముద్దును వల్గర్‌గా ఫీల్ అయ్యావంటే అందులో నీకు వల్గారిటియే కనిపిస్తుంది. అదే నువ్వు ముద్దు సన్నివేశాన్ని గౌరవించి.. ఎంత ఇష్టంతో నటిస్తే ఆ సన్నివేశం అంతబాగా పండుతుంది. కథలో భాగంగా ప్రతి సీన్లోని ఇంటెన్షన్ తెలుసుకోవాలని’ చెప్పారని పేర్కొన్నారు. అలా తన తండ్రి మహేష్ భట్ ప్రోత్సాహంతో ముద్దు సీన్లో నటించగలిగానని, అప్పుడు ఆయన చెప్పిన మాటలను ఇప్పటికి గుర్తుచేసుకుంటూ కెమెరా ముందు నిబద్ధతతో నటిస్తుంటానని పూజా తెలిపారు. కాగా పూజా భట్ 1991 చిత్రం సడక్తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సంజయ్ దత్‌కు ఆమె హీరోయిన్గా నటించారు. ఈ మూవీకి ఆమె తండ్రి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పూజా భట్ ఇటీవల 'బాంబే బేగమ్స్' అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న నెట్ ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ విడుదలైంది. చదవండి: ట్రెండింగ్: సడక్ 2కు డిస్‌లైకుల వర్షం -
చెత్త సినిమా, 1 స్టార్ రేటింగే ఎక్కువ!
స్టార్ డైరెక్టర్ మహేశ్ భట్ నిర్మించిన, ఆయన కూతురు, హీరోయిన్ అలియా భట్ నటించిన తాజా చిత్రం "సడక్ 2". ఈ సినిమా ట్రైలర్ ప్రపంచంలోనే అత్యధిక డిస్‌లైకులు తెచ్చుకున్న రెండో యూట్యూబ్ వీడియోగా రికార్డుకెక్కిన విషయం తెలిసిందే. చూస్తుంటే ఇప్పుడు సినిమా కూడా రికార్డులు కొట్టేటట్లు కనిపిస్తోంది. ఆగస్టు 28న ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం పరమ చెత్తగా ఉందంటూ 35 వేలకు పైగా ప్రేక్షకులు ఐఎండీబీలో 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇంకా ఎంతోమంది ఇదే రేటింగ్ ఇస్తూనే ఉన్నారు. దీంతో ఐఎండీబీలో అత్యంత హీనమైన రేటింగ్ దక్కించుకున్న చిత్రంగా సడక్ మొదటి స్థానంలో నిలిచింది. 1.3 స్టార్ రేటింగ్‌తో టర్కీ సినిమా రెండో స్థానంలో ఉంది. (చదవండి: ప్రపంచ రికార్డు కొట్టేసిన సడక్ 2) కాగా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి బాలీవుడ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయనకు సరైన గుర్తింపు, అవకాశాలు ఇవ్వలేదంటూ సుశాంత్ అభిమానులు స్టార్ సెలబ్రిటీలపై విరుచుకుపడ్డారు. నెపోటిజమ్ మహారాణి అంటూ అలియా భట్‌ను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె నటించిన 'సడక్ 2' ట్రైలర్ విడుదల అవగా దానికి డిస్‌లైక్‌లు కొడుతూ ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. తాజాగా సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలవడంతో మరోసారి రేటింగ్స్‌తో తమ ప్రతాపాన్ని చూపించారు. 'సినిమా దరిద్రంగా ఉంది', 'ఒక్క స్టార్ ఇవ్వడమే ఎక్కువ', 'నటన అస్సలు బాగోలేదు', 'ఫస్టాఫే బోర్ కొట్టేసింది' అంటూ నెటిజన్లు ఒకటికి మించి రేటింగ్ ఇవ్వడం లేదు. (చదవండి: ఇద్దరు ముద్దుగుమ్మల డాన్స్.. అదుర్స్) -
ప్రపంచ రికార్డు కొట్టేసిన సడక్ 2
సోషల్ మీడియా తలుచుకుంటే జరగనిదంటూ ఏదీ లేదని మరోసారి నిరూపితమైంది అలియా భట్ చిత్రం "సడక్ 2" నుంచి విడుదలైన ట్రైలర్ ప్రపంచంలోనే రెండో మోస్ట్ డిస్లైక్డ్ వీడియోగా రికార్డులకెక్కింది. ఈ ట్రైలర్‌ను ఇప్పటివరకు 61 మిలియన్ల మంది వీక్షించగా, జస్టిస్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటూ కుండపోతగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 11.65 మిలియన్ల మంది ఈ వీడియోకు డిస్లైక్ కొట్టడంతో ప్రపంచ రికార్డు కొట్టేసింది. దీంతో అప్పటివరకు అత్యధికంగా డిస్‌లైకులు సాధించిన వీడియోగా రెండో స్థానంలో ఉన్న జస్టిన్ బీబర్ బేబీ పాట మూడో స్థానానికి దిగజారింది. బీబర్ రికార్డు బద్ధలు కొట్టడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టడం గమనార్హం. 18 మిలియన్ల డిస్‌లైకులతో "యూట్యూబ్ రివైండ్ 2018: ఎవ్రీ వన్ కంట్రోల్స్ రివైండ్" వీడియో అగ్ర స్థానంలో ఉంది. ఆగస్టు 12 సడక్ 2 సినిమా ట్రైలర్ విడుదల అవగా ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే నిలుస్తుండటం విశేషం. (రూ.4.5 కోట్ల ప్లాటు.. రియా కోసం కాదు) బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అలియా భట్, మహేశ్ భట్, రియా చక్రవర్తి, పలువురు సెలబ్రిటీల వల్లే ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన సడక్ 2పై ప్రతికూల ప్రభావం పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్‌ను అణగదొక్కి, మానసికంగా నరకం చూపి, పరోక్షంగా ఆత్మహత్యకు కారణమై, మీరు మాత్రం సినిమాలు చేసుకుంటున్నారా? అని అబిమానులు సోషల్ మీడియాలో ఆక్రోశం వెల్లగక్కారు. (సడక్ 2: ట్రైలర్‌ను వేటాడేస్తున్న నెటిజన్లు) దీంతో "సడక్2కు డిస్‌లైక్‌లు కొడదాం" అని ప్రతిజ్ఞ పూని ఓ రకంగా ఉద్యమమే మొదలు పెట్టారు. ఈ ప్రతిజ్ఞ దావానంలా వ్యాపించి ప్రతి ఒక్కరినీ తమ ప్రమేయం లేకుండానే డిస్లైక్ కొట్టించేలా చేసింది. దీనికి యూట్యూబ్‌లో కన్పిస్తున్న కామెంట్లే నిదర్శనం. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, ఇలా ఎన్నో దేశాల నుంచి కూడా సుశాంత్ అభిమానులు యాంటీ సడక్ ఉద్యమంలో పాల్గొని డిస్లైక్ కొట్టారు. "కేవలం డిస్లైక్ కొట్టడానికే ఈ వీడియో ఓపెన్ చేశాను" అంటూ ఎంతో మంది కామెంట్లు చేశారంటే సడక్ 2పై ఏమేరకు ప్రభావం పడిందో అర్థం చేసుకోవచ్చు. (దర్శకుడు నిషికాంత్ ఇకలేరు) -
సడక్ 2: ట్రైలర్‌ను వేటాడేస్తున్న నెటిజన్లు
ఏ సినిమా అయినా ఎక్కువ వ్యూస్ వస్తూ, అధిక లైకులు తెచ్చుకుంటుంటే గొప్పగా చెప్పుకుంటాం. ఇక్కడ కూడా ఓ చిత్రం రికార్డులు బ్రేక్ చేస్తోంది. కానీ దీని కథ, స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్.. పూర్తిగా వేరు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటించిన తాజా చిత్రం 'సడక్ 2'. ఆమె తండ్రి మహేశ్ భట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది గంటల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం. ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. అతని మరణంతో బాలీవుడ్లో నెపోటిజమ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రాజుకున్నాయి. (అలియా సిగ్గు లేకుండా అవార్డు తీసుకుంది) Sadak2 trailer released on YouTube , meanwhile boycott gang.... #sadak2trailer pic.twitter.com/CVDyoxfhoz — तूफ़ान का देवताᵀʰᵒʳ 🚩 (@iStormbreaker_) August 12, 2020 బయట నుంచి వచ్చిన సుశాంత్‌కు అవకాశాలు ఇవ్వకుండా, సహనటుడిగా కనీస గౌరవం ఇవ్వకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు మానసిక క్షోభకు గురి చేశారన్న అభిప్రాయం అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది. దానికి పరిణామంగా స్టార్ కిడ్స్‌పై ఆగ్రహావేశాలు, వారిని అన్‌ఫాలో చేయడం, దర్శక నిర్మాతలను విమర్శించడంలాంటివి చూస్తూనే ఉన్నాం. ఓ పాత వీడియోలో సుశాంత్ ఎవరో తెలీదన్న అలియాను కూడా నెటిజన్లు ఏకిపారేశారు. అలాగే సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తితో సన్నిహితంగా ఉన్న ఆమె తండ్రి మహేశ్ భట్‌పై కూడా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోలేమంటూ అభిమానులు సోషల్ మీడియాలో "డిస్లైక్ క్యాంపెయిన్" చేపడుతూ వారి ప్రతాపాన్ని చూపిస్తూన్నారు. (సుశాంత్ మాజీ ప్రియురాలి ఫోటోలు వైరల్) Alia bhatt and mahesh bhatt after seeing memes on #sadak2trailer #Sadak2 ~ pic.twitter.com/LrN2osKDkg — 𝙋𝙍𝙄𝙏𝘼𝙈 🎧 (@impritzz) August 10, 2020 ఫలితంగా యూట్యూబ్‌లో "సడక్ 2 ట్రైలర్‌కు 2.4 మిలియన్ల డిస్‌లైకులు వచ్చిపడ్డాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చూస్తుంటే ప్రపంచంలోనే అత్యధిక డిస్‌లైకులు తెచ్చుకున్న ట్రైలర్‌గా సడక్ 2 నిలిచే అవకాశం ఉంది. దీనికి లైకులు మాత్రం లక్షా 41 వేలుగా ఉంది. ట్రైలర్ కింద ఈ సినిమాను విమర్శిస్తూ "జస్టిస్ ఫర్ సుశాంత్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల అవుతుండటంతో #UninstallHotstar సైతం సోమవారం ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ఈ సినిమా ఆస్టు 28న హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. కాగా సుశాంత్ ఫ్యామిలీ రూపొందించిన నెపోమీటర్ కూడా ఈ చిత్రాన్ని 98 శాతం సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారితో తెరకెక్కించారని ప్రకటించిన విషయం తెలిసిందే. (సుశాంత్ ఆత్మహత్య: వెలుగులోకి రియా కాల్‌డేటా) Sadak2 trailer getting negative reviews and many dislike . Bollywood critics to Public : pic.twitter.com/st2jbv4y92 — Sachin 🇮🇳 (@Sarcasmbro10) August 12, 2020 సోషల్ మీడియాలో సడక్ 2 ట్రైలర్‌పై ఏమంటున్నారంటే.. ఈ సమయం కోసం కదా ఇన్నాళ్లు మేము వేచి చూస్తుంది అంటూ మీమ్స్‌రాయుళ్లు చెలరేగిపోతున్నారు. 'ఎంతగా ఎదురు చూశానో డిస్లైక్ కొట్టడానికి అంటూ ఓ మీమ్ చాలామంది పరిస్థితికి అద్దం పడుతోంది. మరి ఈ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. Me waiting for #Sadak2 trailer so I can report n dislike it..😎#UninstallHotstar pic.twitter.com/5zjS1biohr — Shivanshu Mishra (@shivanshuBTC17) August 10, 2020 #UninstallHotstar for releasing sadak 2 amid the ongoing case on bollywood mafia . Le Hotstar : pic.twitter.com/AwptPPJAjk — Sachin 🇮🇳 (@Sarcasmbro10) August 10, 2020 #UninstallHotstar is trending because of #Sadak2. But IPL starts from next month and people need Hotstar again. *Hotstar to everyone: pic.twitter.com/llwQXtzM5H — Soumya Gorai (@ItzSoumyaHere) August 10, 2020 Me disliking both the Sadak2 trailers on Hotstar and Foxstar pic.twitter.com/mw7zAhJ7LT — Kaushal (@varishchik) August 12, 2020 More power 💪 to the that Dislike Button who is bearing so much hit right now for,, being on #sadak2trailer for,,🥶🥶#Sadak2 #AliaBhatt #BycottBollywood #BycottSadak2 pic.twitter.com/TF63saSxM2 — Sushant (@its_sushant1) August 12, 2020 Me while watching #Sadak2 trailer!! No wonder this will be the most disliked trailer on YouTube Dislike Dislike Dislike!!!! pic.twitter.com/i6sZzV36Ay — Vanita (@ChaiPeCharcha__) August 12, 2020 -
అలియాకు షాక్.. డిస్‌లైక్‌ల వరద
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది. ఎంతో టాలెంట్.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ నటుడు అకాల మరణం చెందడం అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్లో ఉన్న నెపోటిజం(బంధుప్రీతి) వల్లే సుశాంత్ చనిపోయాడని బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య వెనక కారణాలు వెలికి తీయాలని ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కరణ్ జోహార్, అలియా భట్, ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నడాని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రభావం మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్ 2’పై పడింది. సంజయ్ దత్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘సడక్ 2’ ట్రైలర్ కాసేపటి క్రితమే విడులైంది. అయితే ఈ ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో డిస్‌లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇప్పటివరకు 2.5 మిలియన్ల మంది దీన్ని డిస్లైక్ చేశారు. (ఆకట్టుకుంటున్న సడక్ 2 ట్రైలర్) ఈ ట్రైలర్ థ్రిల్లర్ కథాంశంతో ఆకట్టుకునేలా మహేష్ భట్ తీర్చిదిద్దినా.. సుశాంత్ ఆత్మహత్యకు మహేష్ భట్ ఫ్యామిలీనే పరోక్ష కారణం అంటూ .. చాలా మంది సుశాంత్ అభిమానులు.. ఈ ట్రైలర్‌ను డిస్లైక్ చేస్తున్నారు. ఇప్పటివరకు 88వేల మంది ట్రైలర్‌ను లైక్ చేస్తే.. 2.5మిలయన్ల మంది డిస్లైక్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగిటివిటి ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని.. అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్‌స్టార్ యాప్‌ను అన్ ఇన్స్టాల్ చేయాలనీ సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. #UninstallHotstar అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు. 1991లో వచ్చిన సడక్‌కు సీక్వెల్‌గా సడక్2 తెరకెక్కింది. దీనిలో సంజయ్ దత్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.(ఓటీటీలో సడక్ 2) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై భారీ చర్చ జరుగుతున్నది. బాలీవుడ్లో హీరోల పిల్లలకు లేదా నిర్మాతల పిల్లలకు మాత్రమే ప్రోత్సాహం అందిస్తున్నారని.. బయట నుంచి వచ్చే వాళ్లను ఎదగనివ్వకుండా, ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు అభిమానులు. ఈ కారణంగానే.. ఆ ఒత్తిడి భరించలేక సుశాంత్ లాంటి వాళ్లు ఎందరో బలైపోతున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సడక్ 2’ వంటి ట్రైలర్‌కు డిస్ లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇక డిస్నీ హాట్ స్టార్‌లో సడక్ 2 ఈ నెల 28న విడుదల కానుంది. ఇక దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు. -
ఆకట్టుకుంటున్న సడక్ 2 ట్రైలర్
ముంబై : సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ఆదిత్యారాయ్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా మహేశ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన సడక్ 2 ట్రైలర్ వచ్చేసింది. 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ సడక్‌కు ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి రవివర్మ పాత్రలో నటిస్తున్న సంజయ్ తన భార్య(పూజా భట్) చనిపోవడంతో ట్యాక్సీ డ్రైవర్ వృత్తిని మానేసి ప్రశాంత జీవితం గడుపుతుంటాడు. దేవుడి పేరుతో ప్రజలను మభ్యపెడుతన్న నకిలీ బాబా గుట్టును బయటపెట్టడానికి ఆలియా ప్రయత్నిస్తుంటుంది. సంజయ్, ఆదిత్యారాయ్ కపూర్ల సహకారంతో నకిలీ బాబా గుట్టును ఆమె ఎలా బహిర్గతం చేస్తుందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. (ఓటీటీలో సడక్ 2) నకిలీ బాబా పాత్రలో మకర్ దేశ్ పాండే, గుల్షన్ గ్రోవర్, జిష్ణు సేన్ గుప్తా తదితరులు నటిస్తున్నారు. విశేష్ ఫిలింస్ బ్యానర్ పేరు మీద ముఖేశ్ భట్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో 21 ఏళ్ల తర్వాత మహేశ్ భట్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటించిన చిత్రమిది. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడటం, ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు యూనిట్ మొగ్గుచూపింది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈనెల 28న విడుదల కానుంది. కాగా సంజయ్ దత్ మంగళవారం నానావతి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ బారీన పడినట్లు సమాచారం. సంజయ్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నట్లు తెలిసింది.('సంజయ్.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు') -
ఓటీటీలో సడక్ 2
ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సడక్ 2’. ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్, పూజా భట్ కీలక పాత్రలు చేశారు. తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటించిన చిత్రమిది. 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘సడక్’కి ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఆలియా, సంజయ్ దత్ లుక్స్‌ను విడుదల చేశారు. నేడు ‘సడక్ 2’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూతపడటం, ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు యూనిట్ మొగ్గుచూపింది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈనెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
ప్రతి అడుగూ విలువైనదే
కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. మహేశ్ భట్ దర్శకత్వంలో సంజయ్ దత్, పూజా భట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా ‘సడక్ 2’. మహేశ్‌భట్ దర్శకత్వంలోనే 1991లో వచ్చిన ‘సడక్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యారు ఆలియా. ‘‘సడక్ 2’ సెట్స్‌పైకి వెళ్లింది. మా నాన్నగారు (మహేశ్ భట్) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అపారమైన, అందమైన, ఓ ఎమోషనల్ పర్వతాన్ని ఎక్కబోయే చిన్న ఎలుకగా నన్ను నేను ఊహించుకుంటున్నాను. నేను ఈ పర్వత శిఖరాన్ని చేరుకోగలనని అనుకుంటున్నాను. ఇది అనుకున్నంత ఈజీ కాదని తెలుసు (తండ్రి డైరెక్షన్లో, సీనియర్స్‌తో కలిసి నటించడాన్ని ఉద్దేశించి). ఒకవేళ మధ్యలో నేను పడిపోతే తిరిగి పుంజుకోగలననే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం వేసే ప్రతి అడుగూ విలువైనదే’’ అని ఆలియా అన్నారు. తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో తొలిసారి నటిస్తున్నారు ఆలియా. ఇక దాదాపు 20ఏళ్ల తర్వాత ‘సడక్ 2’ సినిమా కోసం మహేశ్ భట్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. 1999లో వచ్చిన ‘కారతూష్’ చిత్రం తర్వాత మహేశ్ భట్ ఇంకో సినిమాకు దర్శకత్వం వహించలేదు. -
ముంబైలోనే మకాం
తిరిగి తిరిగి ముంబైలోనే మకాం పెట్టడానికి రెడీ అవుతున్నారు ‘సడక్’ టీమ్. 1991లో మహేశ్‌భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘సడక్ 2’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ‘సడక్ 2’ చిత్రం కోసం మళ్లీ డైరెక్టర్ చైర్లో కూర్చోనున్నారు మహేశ్‌భట్. చివరిసారిగా 1999లో ‘కారతూస్’ చిత్రానికి దర్శకత్వం వహించారు మహేశ్‌భట్. తాజాగా ఆయన తీయనున్న ‘సడక్ 2’లో సంజయ్‌దత్, పూజా భట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ ముఖ్యతారలుగా నటించనున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ని ముందుగా రొమేనియాలో ప్లాన్ చేశారు. అక్కడి లొకేషన్లను కూడా పరిశీలించారు. అక్కడి లొకేషన్స్ నచ్చినప్పటికీ లోకల్ కాస్ట్ అండ్ క్రూ, కొన్ని పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలోనే జరపాలనుకుంటున్నారు. ఆల్రెడీ ముంబైలోని ఓ స్టూడియోలో సెట్ వర్క్ స్టార్ట్ చేశారు. తొలుత సంజయ్‌దత్, ఆలియా భట్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు టీమ్. మే 15 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. -
ఆలియా సో బిజీయా
సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీస్‌లో యంగ్ హీరోయిన్ ఆలియా భట్ పేరు మార్మోగిపోతోంది. బీ టౌన్లో పెద్ద సినిమా ఏదైనా సరే.. అందులో హీరోయిన్‌పాత్రకు ఆలియా పేరు తప్పక పరిశీలిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ‘రాజీ’ చిత్రంతో నటన పరంగా ఆమె సంపాదించుకున్న డిమాండ్ అలాంటిది. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఆలియా భట్ ఒక కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. రామ్‌చరణ్ సరసన నటిస్తారు ఆలియా. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఎంపికయ్యారామె. దాదాపు ఇరవయ్యేళ్ల తర్వాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘ఇన్షా అల్లా’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్గా ఆలియా భట్‌ను ఎంపిక చేశారు. ఇంతకుముందు ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమా కోసం సల్మాన్–భన్సాలీ కలిసి వర్క్ చేశారు. ఇవి కాక ‘కళంక్, బ్రహ్మాస్త్ర, తక్త్, సడక్ 2’ చిత్రాల్లో కూడా ఆలియా కథానాయిక అన్న విషయం తెలిసిందే. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. ‘కళంక్’ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కానుంది. మూడుభాగాలుగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం రిలీజ్‌కు రెడీ అయ్యింది. ‘తక్త్, సడక్ 2’ చిత్రాలు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. -
కొత్త ప్రయాణం
‘సడక్ 2’ ప్రయాణం మొదలైంది. ఈ చిత్రం కోసం లొకేషన్ సెర్చ్ స్టార్ట్ చేశారు దర్శకుడు మహేశ్ భట్. తన 70వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ భట్ ‘సడక్ 2’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహించనున్న చిత్రమిదే కావడం విశేషం. 1999లో మహేశ్ భట్ చివరగా ‘కార్తూస్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘సడక్ 2’ కి సన్నాహాలు మొదలెట్టారు. 1991లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సడక్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో సంజయ్ దత్, పూజాభట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ‘‘సడక్ 2’ ప్రయాణం అధికారికంగా మొదలైంది. లైఫ్‌ను మార్చే కొత్త ప్రయాణం ఆరంభమైన అనుభూతి కలుగుతోంది. డెహ్రాడూన్, కేదార్నాథ్ ప్రదేశాలను షూటింగ్ కోసం పరిశీలించాం’’అన్నారు పూజాభట్. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. -
20 ఏళ్ల తర్వాత!
ఇక మహేశ్ భట్ మెగాఫోన్ పట్టుకునే చాన్స్ లేదు. డైరెక్షన్‌కి ఫుల్స్టాప్ పెట్టేసినట్లే అని ఎవరికి వాళ్లు ఫిక్స్ అవుతున్న తరుణంలో ఆయన ఓ షాకిచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘కార్తూస్’ 1991లో విడుదలైంది. ఇన్నేళ్లు గ్యాప్ తీసుకున్నారు కాబట్టి అలా అనుకోవడం సహజం. అయితే 70వ పుట్టినరోజు (గురువారం) నాడు తన కొత్త సినిమాని మహేశ్ భట్ ప్రకటించారు. 1991లో తాను తెరకెక్కించిన ‘సడక్’ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించడానికి పూనుకున్నారు. ‘అర్థ్, సారాన్ష్, దిల్ హై కే మాన్తా నహీ, ఆషికీ’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మహేశ్ భట్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ‘సడక్ 2’ నటీనటుల విషయానికి వస్తే... సంజయ్‌దత్, ఆలియా భట్, పూజా భట్, ఆదిత్యారాయ్ కపూర్ కీలక పాత్రలు చేయనున్నారు. సంజయ్ దత్, పూజా భట్ తొలి పార్ట్‌లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో తండ్రి మహేశ్ భట్‌తో తొలిసారి వర్క్ చేయనున్నారు ఆలియా భట్. అలాగే సిస్టర్ పూజా భట్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకోబోతున్నారు. మహేశ్ భట్ దర్శకత్వంలో దాదాపు 25 ఏళ్ల తర్వాత నటిస్తున్నారు సంజయ్ దత్. వీరిద్దరి కాంబినేషన్లో చివరిసారిగా 1993లో ‘గుమ్రాహ్’ సినిమా వచ్చింది. అలాగే ‘ఆషికీ 2’ తర్వాత ముఖేష్ భట్ నిర్మాణంలో ఆదిత్యారాయ్ కపూర్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ‘సడక్ 2’ సినిమాకు సంజయ్‌దత్‌నే అంకురార్పణ చేశారట. ‘‘నాన్నగారి బర్త్‌డేకి నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో నటించాలన్న నా కల నిజమైంది’’ అని ఆలియా ఓ ఎమోషనల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ చిత్రం 2020 మార్చి 25న రిలీజ్ కానుంది. -
ఫస్ట్ పార్ట్‌లో హీరో.. సెకండ్ పార్ట్‌లో విలన్
బాలీవుడ్ కాంట్రవర్షియల్ హీరో సంజయ్ దత్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా సడక్. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను మహేష్ భట్ తెరకెక్కించారు. పూజా భట్ సంజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయిన 26 ఏళ్ల తరువాత ఇప్పుడు సీక్వల్ ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈ సీక్వల్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సడక్ సినిమా ఎక్కడ ఆగిపోయిందో.. అక్కడి నుంచే సడక్ 2 కథ మొదలవుతుందని తెలుస్తోంది. అయితే తొలి భాగంలో హీరోగా నటించిన సంజయ్ దత్ సీక్వల్ లో విలన్ గా కనిపించనున్నాడట. మరో యువ జంట హీరో హీరోయిన్లుగా నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం భూమి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సంజయ్, తరువాత ద గుడ్ మహారాజా సినిమాకు ఓకె చెప్పాడు. ఈ రెండు సినిమా తరువాత సడక్ సీక్వల్ పై క్లారిటీ రానుంది. -
బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ కన్నుమూత!
ముంబై: బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ ఆదివారం అర్ధరాత్రి ముంబైలోని కోకిలాబెన్ ధిరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. సదాశివ్ వయస్సు 64 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరిన సదాశివ్ అమ్రాపుర్కర్ ఆదివారం అర్ధరాత్రి 2.45 నిమిషాలకు మృతి చెందారని ఆయన కూతురు రీమా అమ్రాపుర్కర్ మీడియాకు తెలిపారు. అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఆహ్మద్ నగర్ లో నిర్వహిస్తామని రీమా వెల్లడించారు. సదాశివ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం బైదాస్ ఆడిటోరియంలోని ఉంచుతామని ఆమె తెలిపారు. 'అర్ధ్' చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించిన సదాశివ్ అమ్రాపుర్కర్ 'సడక్' చిత్రం ద్వారా విలన్ గా బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంఖే, ఇష్క్, కూలీ నెంబర్ 1, గుప్త్ చిత్రాల్లో విలన్ గా, కారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలితో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన మరాఠీ చిత్రరంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. 1984లో అర్ధ్ సత్య, 1991 లో సడక్ చిత్రానికి ఆయన ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. సదాశివ్ 2012లో నిర్మించిన 'బాంబే టాకీస్' చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ఇటీవల కాలంలో చిత్రాల్లో నటించడం తగ్గించుకుని.. సామాజిక సేవకే ప్రాధాన్యత ఇచ్చారు. సదాశివ్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. Follow @sakshinews -
'మానాన్న ఆరోగ్యంపై వచ్చే రూమర్లను నమ్మకండి'
ముంబై: బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, గత కొద్ది రోజులతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఆయన కూతురు రీమా తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ కారణంగా సదాశివ్ కోకిలాబెన్ ధిరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరారు. 'సదాశివ్ జీ ఆరోగ్య పరిస్థితి కొంత కుదుటపడిందని, వెంటిలెటర్ ద్వారా శ్వాసనందిస్తున్నారు. ఆయన గురించి మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మకండి. మీడియాకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలను అందిస్తాను' అని మీడియాకు పంపిన ఓ ప్రకటనలో రీమా తెలిపారు. అర్ధసత్య చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయమై.. సడక్ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సదాశివ్ అమ్రాపుర్కర్ పలు హిందీ చిత్రాల్లో కనిపించారు. 2012లో ఆయన 'బాంబే టాకీస్' చిత్రంలో చివరిసారిగా నటించారు.