బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ కన్నుమూత!
బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ కన్నుమూత!
Published Mon, Nov 3 2014 8:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM
ముంబై: బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ ఆదివారం అర్ధరాత్రి ముంబైలోని కోకిలాబెన్ ధిరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. సదాశివ్ వయస్సు 64 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరిన సదాశివ్ అమ్రాపుర్కర్ ఆదివారం అర్ధరాత్రి 2.45 నిమిషాలకు మృతి చెందారని ఆయన కూతురు రీమా అమ్రాపుర్కర్ మీడియాకు తెలిపారు. అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఆహ్మద్ నగర్ లో నిర్వహిస్తామని రీమా వెల్లడించారు. సదాశివ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం బైదాస్ ఆడిటోరియంలోని ఉంచుతామని ఆమె తెలిపారు.
'అర్ధ్' చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించిన సదాశివ్ అమ్రాపుర్కర్ 'సడక్' చిత్రం ద్వారా విలన్ గా బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంఖే, ఇష్క్, కూలీ నెంబర్ 1, గుప్త్ చిత్రాల్లో విలన్ గా, కారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలితో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన మరాఠీ చిత్రరంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. 1984లో అర్ధ్ సత్య, 1991 లో సడక్ చిత్రానికి ఆయన ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. సదాశివ్ 2012లో నిర్మించిన 'బాంబే టాకీస్' చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ఇటీవల కాలంలో చిత్రాల్లో నటించడం తగ్గించుకుని.. సామాజిక సేవకే ప్రాధాన్యత ఇచ్చారు. సదాశివ్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement