సోషల్ మీడియా తలుచుకుంటే జరగనిదంటూ ఏదీ లేదని మరోసారి నిరూపితమైంది అలియా భట్ చిత్రం "సడక్ 2" నుంచి విడుదలైన ట్రైలర్ ప్రపంచంలోనే రెండో మోస్ట్ డిస్‌లైక్‌డ్ వీడియోగా రికార్డులకెక్కింది. ఈ ట్రైలర్‌ను ఇప్పటివరకు 61 మిలియన్ల మంది వీక్షించగా, జస్టిస్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటూ కుండపోతగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 11.65 మిలియన్ల మంది ఈ వీడియోకు డిస్‌లైక్ కొట్టడంతో ప్రపంచ రికార్డు కొట్టేసింది. దీంతో అప్పటివరకు అత్యధికంగా డిస్‌లైకులు సాధించిన వీడియోగా రెండో స్థానంలో ఉన్న జస్టిన్ బీబర్ బేబీ పాట మూడో స్థానానికి దిగజారింది. బీబర్ రికార్డు బద్ధలు కొట్టడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టడం గమనార్హం. 18 మిలియన్ల డిస్‌లైకులతో "యూట్యూబ్ రివైండ్ 2018: ఎవ్రీ వన్ కంట్రోల్స్ రివైండ్" వీడియో అగ్ర స్థానంలో ఉంది. ఆగస్టు 12 సడక్ 2 సినిమా ట్రైలర్ విడుదల అవగా ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే నిలుస్తుండటం విశేషం. (రూ.4.5 కోట్ల ప్లాటు.. రియా కోసం కాదు)
బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అలియా భట్, మహేశ్ భట్, రియా చక్రవర్తి, పలువురు సెలబ్రిటీల వల్లే ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన సడక్ 2పై ప్రతికూల ప్రభావం పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్‌ను అణగదొక్కి, మానసికంగా నరకం చూపి, పరోక్షంగా ఆత్మహత్యకు కారణమై, మీరు మాత్రం సినిమాలు చేసుకుంటున్నారా? అని అబిమానులు సోషల్ మీడియాలో ఆక్రోశం వెల్లగక్కారు. (సడక్ 2: ట్రైలర్‌ను వేటాడేస్తున్న నెటిజన్లు)
దీంతో "సడక్2కు డిస్‌లైక్‌లు కొడదాం" అని ప్రతిజ్ఞ పూని ఓ రకంగా ఉద్యమమే మొదలు పెట్టారు. ఈ ప్రతిజ్ఞ దావానంలా వ్యాపించి ప్రతి ఒక్కరినీ తమ ప్రమేయం లేకుండానే డిస్‌లైక్ కొట్టించేలా చేసింది. దీనికి యూట్యూబ్‌లో కన్పిస్తున్న కామెంట్లే నిదర్శనం. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, ఇలా ఎన్నో దేశాల నుంచి కూడా సుశాంత్ అభిమానులు యాంటీ సడక్ ఉద్యమంలో పాల్గొని డిస్‌లైక్ కొట్టారు. "కేవలం డిస్‌లైక్ కొట్టడానికే ఈ వీడియో ఓపెన్ చేశాను" అంటూ ఎంతో మంది కామెంట్లు చేశారంటే సడక్ 2పై ఏమేరకు ప్రభావం పడిందో అర్థం చేసుకోవచ్చు. (దర్శకుడు నిషికాంత్ ఇకలేరు)
Comments
Please login to add a commentAdd a comment