Dislikes
-
ప్రపంచ రికార్డు కొట్టేసిన సడక్ 2
సోషల్ మీడియా తలుచుకుంటే జరగనిదంటూ ఏదీ లేదని మరోసారి నిరూపితమైంది అలియా భట్ చిత్రం "సడక్ 2" నుంచి విడుదలైన ట్రైలర్ ప్రపంచంలోనే రెండో మోస్ట్ డిస్లైక్డ్ వీడియోగా రికార్డులకెక్కింది. ఈ ట్రైలర్‌ను ఇప్పటివరకు 61 మిలియన్ల మంది వీక్షించగా, జస్టిస్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటూ కుండపోతగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 11.65 మిలియన్ల మంది ఈ వీడియోకు డిస్లైక్ కొట్టడంతో ప్రపంచ రికార్డు కొట్టేసింది. దీంతో అప్పటివరకు అత్యధికంగా డిస్‌లైకులు సాధించిన వీడియోగా రెండో స్థానంలో ఉన్న జస్టిన్ బీబర్ బేబీ పాట మూడో స్థానానికి దిగజారింది. బీబర్ రికార్డు బద్ధలు కొట్టడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టడం గమనార్హం. 18 మిలియన్ల డిస్‌లైకులతో "యూట్యూబ్ రివైండ్ 2018: ఎవ్రీ వన్ కంట్రోల్స్ రివైండ్" వీడియో అగ్ర స్థానంలో ఉంది. ఆగస్టు 12 సడక్ 2 సినిమా ట్రైలర్ విడుదల అవగా ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే నిలుస్తుండటం విశేషం. (రూ.4.5 కోట్ల ప్లాటు.. రియా కోసం కాదు) బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అలియా భట్, మహేశ్ భట్, రియా చక్రవర్తి, పలువురు సెలబ్రిటీల వల్లే ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన సడక్ 2పై ప్రతికూల ప్రభావం పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్‌ను అణగదొక్కి, మానసికంగా నరకం చూపి, పరోక్షంగా ఆత్మహత్యకు కారణమై, మీరు మాత్రం సినిమాలు చేసుకుంటున్నారా? అని అబిమానులు సోషల్ మీడియాలో ఆక్రోశం వెల్లగక్కారు. (సడక్ 2: ట్రైలర్‌ను వేటాడేస్తున్న నెటిజన్లు) దీంతో "సడక్2కు డిస్‌లైక్‌లు కొడదాం" అని ప్రతిజ్ఞ పూని ఓ రకంగా ఉద్యమమే మొదలు పెట్టారు. ఈ ప్రతిజ్ఞ దావానంలా వ్యాపించి ప్రతి ఒక్కరినీ తమ ప్రమేయం లేకుండానే డిస్లైక్ కొట్టించేలా చేసింది. దీనికి యూట్యూబ్‌లో కన్పిస్తున్న కామెంట్లే నిదర్శనం. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, ఇలా ఎన్నో దేశాల నుంచి కూడా సుశాంత్ అభిమానులు యాంటీ సడక్ ఉద్యమంలో పాల్గొని డిస్లైక్ కొట్టారు. "కేవలం డిస్లైక్ కొట్టడానికే ఈ వీడియో ఓపెన్ చేశాను" అంటూ ఎంతో మంది కామెంట్లు చేశారంటే సడక్ 2పై ఏమేరకు ప్రభావం పడిందో అర్థం చేసుకోవచ్చు. (దర్శకుడు నిషికాంత్ ఇకలేరు) -
సడక్ 2: ట్రైలర్‌ను వేటాడేస్తున్న నెటిజన్లు
ఏ సినిమా అయినా ఎక్కువ వ్యూస్ వస్తూ, అధిక లైకులు తెచ్చుకుంటుంటే గొప్పగా చెప్పుకుంటాం. ఇక్కడ కూడా ఓ చిత్రం రికార్డులు బ్రేక్ చేస్తోంది. కానీ దీని కథ, స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్.. పూర్తిగా వేరు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటించిన తాజా చిత్రం 'సడక్ 2'. ఆమె తండ్రి మహేశ్ భట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది గంటల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం. ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. అతని మరణంతో బాలీవుడ్లో నెపోటిజమ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రాజుకున్నాయి. (అలియా సిగ్గు లేకుండా అవార్డు తీసుకుంది) Sadak2 trailer released on YouTube , meanwhile boycott gang.... #sadak2trailer pic.twitter.com/CVDyoxfhoz — तूफ़ान का देवताᵀʰᵒʳ 🚩 (@iStormbreaker_) August 12, 2020 బయట నుంచి వచ్చిన సుశాంత్‌కు అవకాశాలు ఇవ్వకుండా, సహనటుడిగా కనీస గౌరవం ఇవ్వకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు మానసిక క్షోభకు గురి చేశారన్న అభిప్రాయం అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది. దానికి పరిణామంగా స్టార్ కిడ్స్‌పై ఆగ్రహావేశాలు, వారిని అన్‌ఫాలో చేయడం, దర్శక నిర్మాతలను విమర్శించడంలాంటివి చూస్తూనే ఉన్నాం. ఓ పాత వీడియోలో సుశాంత్ ఎవరో తెలీదన్న అలియాను కూడా నెటిజన్లు ఏకిపారేశారు. అలాగే సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తితో సన్నిహితంగా ఉన్న ఆమె తండ్రి మహేశ్ భట్‌పై కూడా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోలేమంటూ అభిమానులు సోషల్ మీడియాలో "డిస్లైక్ క్యాంపెయిన్" చేపడుతూ వారి ప్రతాపాన్ని చూపిస్తూన్నారు. (సుశాంత్ మాజీ ప్రియురాలి ఫోటోలు వైరల్) Alia bhatt and mahesh bhatt after seeing memes on #sadak2trailer #Sadak2 ~ pic.twitter.com/LrN2osKDkg — 𝙋𝙍𝙄𝙏𝘼𝙈 🎧 (@impritzz) August 10, 2020 ఫలితంగా యూట్యూబ్‌లో "సడక్ 2 ట్రైలర్‌కు 2.4 మిలియన్ల డిస్‌లైకులు వచ్చిపడ్డాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చూస్తుంటే ప్రపంచంలోనే అత్యధిక డిస్‌లైకులు తెచ్చుకున్న ట్రైలర్‌గా సడక్ 2 నిలిచే అవకాశం ఉంది. దీనికి లైకులు మాత్రం లక్షా 41 వేలుగా ఉంది. ట్రైలర్ కింద ఈ సినిమాను విమర్శిస్తూ "జస్టిస్ ఫర్ సుశాంత్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల అవుతుండటంతో #UninstallHotstar సైతం సోమవారం ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ఈ సినిమా ఆస్టు 28న హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. కాగా సుశాంత్ ఫ్యామిలీ రూపొందించిన నెపోమీటర్ కూడా ఈ చిత్రాన్ని 98 శాతం సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారితో తెరకెక్కించారని ప్రకటించిన విషయం తెలిసిందే. (సుశాంత్ ఆత్మహత్య: వెలుగులోకి రియా కాల్‌డేటా) Sadak2 trailer getting negative reviews and many dislike . Bollywood critics to Public : pic.twitter.com/st2jbv4y92 — Sachin 🇮🇳 (@Sarcasmbro10) August 12, 2020 సోషల్ మీడియాలో సడక్ 2 ట్రైలర్‌పై ఏమంటున్నారంటే.. ఈ సమయం కోసం కదా ఇన్నాళ్లు మేము వేచి చూస్తుంది అంటూ మీమ్స్‌రాయుళ్లు చెలరేగిపోతున్నారు. 'ఎంతగా ఎదురు చూశానో డిస్లైక్ కొట్టడానికి అంటూ ఓ మీమ్ చాలామంది పరిస్థితికి అద్దం పడుతోంది. మరి ఈ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. Me waiting for #Sadak2 trailer so I can report n dislike it..😎#UninstallHotstar pic.twitter.com/5zjS1biohr — Shivanshu Mishra (@shivanshuBTC17) August 10, 2020 #UninstallHotstar for releasing sadak 2 amid the ongoing case on bollywood mafia . Le Hotstar : pic.twitter.com/AwptPPJAjk — Sachin 🇮🇳 (@Sarcasmbro10) August 10, 2020 #UninstallHotstar is trending because of #Sadak2. But IPL starts from next month and people need Hotstar again. *Hotstar to everyone: pic.twitter.com/llwQXtzM5H — Soumya Gorai (@ItzSoumyaHere) August 10, 2020 Me disliking both the Sadak2 trailers on Hotstar and Foxstar pic.twitter.com/mw7zAhJ7LT — Kaushal (@varishchik) August 12, 2020 More power 💪 to the that Dislike Button who is bearing so much hit right now for,, being on #sadak2trailer for,,🥶🥶#Sadak2 #AliaBhatt #BycottBollywood #BycottSadak2 pic.twitter.com/TF63saSxM2 — Sushant (@its_sushant1) August 12, 2020 Me while watching #Sadak2 trailer!! No wonder this will be the most disliked trailer on YouTube Dislike Dislike Dislike!!!! pic.twitter.com/i6sZzV36Ay — Vanita (@ChaiPeCharcha__) August 12, 2020 -
అలియాకు షాక్.. డిస్‌లైక్‌ల వరద
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది. ఎంతో టాలెంట్.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ నటుడు అకాల మరణం చెందడం అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్లో ఉన్న నెపోటిజం(బంధుప్రీతి) వల్లే సుశాంత్ చనిపోయాడని బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య వెనక కారణాలు వెలికి తీయాలని ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కరణ్ జోహార్, అలియా భట్, ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నడాని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రభావం మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్ 2’పై పడింది. సంజయ్ దత్, ఆలియా భట్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘సడక్ 2’ ట్రైలర్ కాసేపటి క్రితమే విడులైంది. అయితే ఈ ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో డిస్‌లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇప్పటివరకు 2.5 మిలియన్ల మంది దీన్ని డిస్లైక్ చేశారు. (ఆకట్టుకుంటున్న సడక్ 2 ట్రైలర్) ఈ ట్రైలర్ థ్రిల్లర్ కథాంశంతో ఆకట్టుకునేలా మహేష్ భట్ తీర్చిదిద్దినా.. సుశాంత్ ఆత్మహత్యకు మహేష్ భట్ ఫ్యామిలీనే పరోక్ష కారణం అంటూ .. చాలా మంది సుశాంత్ అభిమానులు.. ఈ ట్రైలర్‌ను డిస్లైక్ చేస్తున్నారు. ఇప్పటివరకు 88వేల మంది ట్రైలర్‌ను లైక్ చేస్తే.. 2.5మిలయన్ల మంది డిస్లైక్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగిటివిటి ఉందో అర్ధమవుతోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని.. అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్‌స్టార్ యాప్‌ను అన్ ఇన్స్టాల్ చేయాలనీ సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. #UninstallHotstar అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు. 1991లో వచ్చిన సడక్‌కు సీక్వెల్‌గా సడక్2 తెరకెక్కింది. దీనిలో సంజయ్ దత్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.(ఓటీటీలో సడక్ 2) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై భారీ చర్చ జరుగుతున్నది. బాలీవుడ్లో హీరోల పిల్లలకు లేదా నిర్మాతల పిల్లలకు మాత్రమే ప్రోత్సాహం అందిస్తున్నారని.. బయట నుంచి వచ్చే వాళ్లను ఎదగనివ్వకుండా, ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు అభిమానులు. ఈ కారణంగానే.. ఆ ఒత్తిడి భరించలేక సుశాంత్ లాంటి వాళ్లు ఎందరో బలైపోతున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సడక్ 2’ వంటి ట్రైలర్‌కు డిస్ లైక్‌ల వరద కొనసాగుతోంది. ఇక డిస్నీ హాట్ స్టార్‌లో సడక్ 2 ఈ నెల 28న విడుదల కానుంది. ఇక దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు. -
అవంటే అయిష్టం
ప్లాస్టిక్ నవ్వులు, పైపై మెరుగులంటే అనుష్కా శర్మకు అయిష్టం. మనస్ఫూర్తిగా మాట్లాడటం.. మనసులో అనిపించింది ఓపెన్‌గా చెప్పేయడం ఇష్టం. ఇంకా ఈ బ్యూటీకి బోల్డన్ని ‘ఇష్టాయిష్టాలు’ ఉన్నాయి. అవేంటో సరదాగా తెలుసుకుందాం... ఇష్టాలు ♦ పుస్తకాలంటే ప్రాణం. ఫ్రెండ్స్ సరదాగా ‘పుస్తకాల పురుగు’ అని పిలుస్తుంటారు. ఆ పుస్తకం ఈ పుస్తకం అని కాదు.. చేతికి దొరికిందల్లా చదివేస్తారు. షూటింగ్లో షాట్ గ్యాప్‌లో ఏదో ఒక బుక్ చదువుతుంటారు. ♦ రొయ్యలు, చేపలు ఎలా వండినా ఇష్టపడేవారు. చికెన్ కర్రీ విత్ బటర్ అంటే చాలా ప్రీతి. కానీ, కొన్ని నెలల క్రితం మాంసాహారం మానేశారు. ఇప్పుడు కూరగాయలను ఇష్టపడుతున్నారు. ♦ నలుపు రంగంటే చాలా ఇష్టం. వార్డ్ రోబ్‌లో ఆ రంగు డ్రెస్‌లే ఎక్కువ. ♦ సినిమాల్లో పాటలకు డ్యాన్స్ చేయడం కామన్. కానీ, విడిగా కూడా ఖాళీ దొరికినప్పుడల్లా డ్యాన్స్ చేస్తుంటారు. ఎందుకంటే డ్యాన్స్ అంటే అనుష్కకు చాలా ఇష్టం. ♦ ఒక్కరోజు యోగా చేయకపోయినా ఏదో వెలితిగా ఉన్నట్లు ఫీలైపోతారు. యోగా అంటే బోల్డంత లైకింగ్ మరి. ♦ ముక్కుసూటిగా వ్యవహరించడం ఇష్టం. ♦ ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు హ్యాండ్ బ్యాగ్‌లో ఏది ఉన్నా లేకపోయినా ‘ప్రోటీన్ బార్స్’ ఉండేలా చూసుకుంటారు. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి, అవంటే చాలా ఇష్టం. ♦ అందమైన జుత్తంటే అనుష్కకు ఇష్టం. హెయిర్ కేర్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. షాంపూలు, కండిషనర్లు, హెయిర్ మాస్కులు కొంటుంటారు. షూలంటే బోల్డంత ఇష్టం. లెక్కలేనన్ని ఉన్నాయి. ♦ జపనీస్, ఇటాలియన్ వంటకాలంటే వల్లమాలిన ఇష్టం. ఎంత తిన్నా బరువు పెరగరు. అది తన అదృష్టం అంటారు అనుష్క. ♦ స్వేచ్ఛగా బతకాలనుకుంటారు. తనకు నచ్చినట్లుగా ఇల్లు కొనుక్కున్నారు. అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటిని డిజైన్ చేయించుకున్నారు. ఆ ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇష్టం. అయిష్టాలు ♦ స్మోకింగ్ అంటే అనుష్కా శర్మకు పరమ అసహ్యం. ఎవరైనా సిగరెట్ తాగుతూ కనిపిస్తే చెడామడా తిట్టాలనిపిస్తుందట. ♦ డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లంటే ఇష్టం ఉండదు. స్టేటస్ చూసి ఫ్రెండ్షిప్ చేసేవాళ్లను ఆమడ దూరంగా ఉంచేస్తారు. ♦ బిజీ బిజీగా షూటింగ్స్ చేయడం నచ్చదు. షూటింగ్ లొకేషన్లో ఎవరైనా అనవసరంగా హైరానా పడుతుంటే ‘కూల్ బాసూ’ అంటారు. ♦ గాసిప్పురాయుళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. విరాట్ గురించి, తన గురించి వార్తలు ప్రచారం చేసేవాళ్లు కంటికి కనిపిస్తే రఫ్ఫాడేయాలనేంత కోపం. ♦ అనుష్కా శర్మ అతిగా అసహ్యించుకునేవాటిలో ‘నైట్ షూటింగ్’ ఒకటి. నైట్ షూట్స్ చేసినప్పుడు చాలా డిస్ట్రబ్ అయిపోతారు. ♦ ‘మీ పెళ్లెప్పుడు’ అని ఎవరైనా అడిగితే, చెంప చెళ్లుమనిపించేంత కోపం వస్తుంది. విలేకరుల నుంచి ఆ ప్రశ్న వినకూడదనుకుంటారు. ♦ నర్మగర్భంగా వ్యవహరించేవాళ్లంటే ఇష్టం ఉండదు. అలాంటివాళ్లను వీలైనంత దూరంగా ఉంచుతారు. ♦ చాక్లెట్స్, కాఫీ, నెయిల్ ఆర్ట్ (గోరు మీద వేసే డిజైన్) వంటివాటిని ఇష్టపడరు. ♦ ఆడవాళ్లు అబలలు అనే మాట వినడానికి ఇష్టపడరు. అలా ఎవరైనా అంటే, వాళ్లకి ఓ రేంజ్లో క్లాస్ తీసుకుంటారు. ♦ ప్లాస్టిక్ నవ్వులు నవ్వడం చేతకాదు. అలా నవ్వేవాళ్లంటే అయిష్టం.