కవలైవేండామ్‌కు బాలీవుడ్ గాయకుడి పాట | Kavalai Vendam team ropes in Armaan Malik | Sakshi
Sakshi News home page

కవలైవేండామ్‌కు బాలీవుడ్ గాయకుడి పాట

Published Wed, Aug 10 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

కవలైవేండామ్‌కు బాలీవుడ్ గాయకుడి పాట

కవలైవేండామ్‌కు బాలీవుడ్ గాయకుడి పాట

కవలైవేండామ్ చిత్రానికి బాలివుడ్ ప్రముఖ గాయకుడు అర్మూన్ మాలిక్ పాట పాడడం విశేషం. జీవా నటించిన తిరునాళ్ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇందులో నయనతార నాయకిగా నటించారు. జీవా నటిస్తున్న మరో చిత్రం కవలైవేండామ్. ఇంతకు ముందు కో, కో-2, యామెరుక్కక భయమే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎల్‌రెడ్.కుమార్ తన ఆర్‌ఎస్ ఇన్ఫోటెయిన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం కవలైవేండామ్.

డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి లియో జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన తెలుపుతూ బాలీవుడ్ గాయకుడు అర్మాన్ మాలిక్ గానానికి మైమరచిపోని వారుండరన్నారు.అలాంటిది తాను ఆయన  అభిమానినని తెలిపారు. ఆయన ఇంతకు ముందు పాడిన ఉన్ కాదల్ పాట తరహాలో కవలైవేండామ్ చిత్రం కోసం ఒక మెలోడి పాట పాడించాలని భావించామన్నారు.

ఆయన్ని సోషల్ మీడియా ద్వారా సంప్రదించి తమకు ఒక పాట పాడాలని కోరామన్నారు. వెంటనే ఆయన పాట లిరిక్స్ పంపమని చెప్పగా తాను ట్యూన్ సహా పాటను పంపామన్నారు. పాట విన్న అర్మాన్ మాలిక్ చాలా బాగుందంటూ పాడారన్నారు. దీని ముంబాయిలోని ఒక ప్రముఖ రికార్డింగ్ స్టూడియోలో రికార్డు చేసినట్లు వెల్లడించారు. ఈ పాట కచ్చితంగా ప్రేక్షకులకు వీనుల విందుగా ఉంటుందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement