నా మనసుకి దగ్గరైన చిత్రమిది - కాజల్ | Jeeva, Kajal Aggarwal new movie Kavalai Vendam | Sakshi
Sakshi News home page

నా మనసుకి దగ్గరైన చిత్రమిది - కాజల్

Published Fri, Oct 28 2016 11:25 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

నా మనసుకి దగ్గరైన చిత్రమిది - కాజల్ - Sakshi

నా మనసుకి దగ్గరైన చిత్రమిది - కాజల్

‘జీవా, కాజల్ అగర్వాల్ జంటగా డీకే దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘కవలై వేండాం’. ఈ చిత్రాన్ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో డి.వెంకటేశ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను హీరో రాహుల్ రవీంద్రన్, సినిమా ట్రైలర్‌ను నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. డి.వెంకటేశ్ మాట్లాడుతూ- ‘‘కామెడీ ఎంటర్‌టై నర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ‘భలే భలే మగాడివోయ్’, ‘పెళ్లిచూపులు’ తరహాలో ఉంటుంది.

సినిమా సూపర్‌హిట్ అవుతుందని ‘వెన్నెలకంటి’గారు చెప్పడం మరింత సంతోషాన్నిస్తోంది’’ అన్నారు. జీవా మాట్లాడుతూ- ‘‘డీకే నాకు స్నేహితుడు. ‘రంగం’ చిత్రానికి కో-డెరైక్టర్‌గా పనిచేశాడు. డీకే చెప్పిన కథ నచ్చడంతో వెంటనే చేశా. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘జీవా మంచి కోస్టార్. నా మనసుకు బాగా దగ్గరైన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులూ చూసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని కాజల్ అగర్వాల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement