దిగులు పడకురా సహోదరా.. | kajal movie Kavalai vendam remake in telugu as entavaraku e prema | Sakshi
Sakshi News home page

దిగులు పడకురా సహోదరా..

Published Mon, Nov 7 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

దిగులు పడకురా సహోదరా..

దిగులు పడకురా సహోదరా..

‘దిగులు పడకురా సహోదరా..’ అనే పాట తెలిసే ఉంటుంది. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఇదే అంటున్నారు. ఏ విషయానికీ కంగారు పడొద్దు.. లైఫ్‌ని కూల్‌గా ఎంజాయ్ చేయండి అని కాజల్ అగర్వాల్ చెబుతున్నారు. విషయం ఏంటంటే... ‘కవలై వేండాం’ పేరుతో తమిళంలో జీవా సరసన తను నటించిన చిత్రాన్ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి. వెంకటేశ్ తెలుగులో విడుదల చేస్తున్నారు.

కవలై వేండాం అంటే.. దిగులు పడొద్దు అని అర్థం. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఫీల్ గుడ్ మూవీ ఇది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. హృదయానికి హత్తుకునే సన్నివేశాలు కూడాఉన్నాయి. జీవా, కాజల్ కెమిస్ట్రీ బాగుంటుంది. లియోన్ జేమ్స్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement