కన్నప్ప మూవీ.. కాజల్ అగర్వాల్ ఏ పాత్ర చేయనుందంటే? | Actress Kajal Aggarwal First Look Poster Revealed From Kannappa Movie, Check Tweet Inside Goes Viral | Sakshi
Sakshi News home page

Kannappa Movie: కన్నప్పలో కాజల్ అగర్వాల్.. ఏ పాత్రలలో కనిపించనుందంటే?

Published Mon, Jan 6 2025 8:32 PM | Last Updated on Tue, Jan 7 2025 1:14 PM

Actress Kajal Agarwal First Look Poster Revealed In Kannappa Movie

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. అవా ఎంటర్ టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కనిపించనున్నారు.

ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్ చూస్తే ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను అలరించింది. యూట్యూబ్‌లోనూ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

తాజాగా ఈ మూవీ నుంచి కాజల్ ‍అగర్వాల్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో పార్వతి దేవి పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ మేరకు నాలుగు భాషల్లో కాజల్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తో పాటు క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. పార్వతి దేవి లుక్‌లో కాజల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా పోస్టర్‌ను చూసేయండి.

కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్‌, దేవరాజ్‌ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ.. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇందులో కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల  జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్‌లాల్‌ నటిస్తున్నారు. గతంలోనే ఆయన ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు.

కన్నప్ప కథేంటంటే..

పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం అన్నారు మోహన్‌బాబు.

విజువల్ వండర్‌గా కన్నప్ప..

ఈ చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్  సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కూడా. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని ఇస్తుందని వెల్లడించారు. ఆడియన్స్‌ను మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే విధంగా మేకర్స్‌ చిత్రాన్ని రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు.  విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో  పోషిస్తున్నారు.  మోహన్ బాబు నిర్మిస్తున్న  ఈ విజువల్‌ వండర్‌ను  పాన్‌ ఇండియాలో ఈ ఏడాది ఏప్రిల్‌ 25న విడుదల చేయనున్నారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement