కవలైవేండామ్ గీతాలకు మంచి స్పందన | Kavalai Vendam Audio Release | Sakshi
Sakshi News home page

కవలైవేండామ్ గీతాలకు మంచి స్పందన

Published Tue, Oct 18 2016 2:44 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

కవలైవేండామ్ గీతాలకు మంచి స్పందన

కవలైవేండామ్ గీతాలకు మంచి స్పందన

కవలైవేండామ్ చిత్ర గీతాలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తోందని ఆ చిత్ర యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జీవా, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన చిత్రం కవలైవేండామ్. ఇంతకు ముందు కో, యామిరుక్క భయమే, కో-2 వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్‌ఎస్.ఇన్ఫోటెయిన్‌మెంట్ ఎల్‌రెడ్.కుమార్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది.
 
 అదే విధంగా యామిరుక్క భయమే చిత్రం ఫేమ్ డీకే దర్శకత్వం వహిస్తున్న చిత్రం క వలైవేండామ్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన రెండు టీజర్లకు ప్రేక్షకుల మధ్య విశేష స్పందన లభించిందని, దీంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయని చిత్ర వర్గాలు పేర్కొన్నారు.
 
  లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది. కో-2 చిత్రంతోనే సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ మంచి పేరు తెచుకున్నారని, కవలైవేండామ్ చిత్రం ఆయనకు మరింత ప్రాచుర్యం చేస్తుందని అన్నారు. ఇందులోని ఉన్ కాదల్ ఇరుందాల్ పోదుం, నా తొలందాయో అనే  పాటలు సంగీత ప్రియుల మధ్య విశేష ఆదరణ పొందుతున్నాయని తెలిపారు.ఈ తరానికి కావలసిన అన్ని అంశాలతో యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టెయినర్‌గా తెరకెక్కించిన కవలైవేండామ్ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని చిత్ర నిర్మాత వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement