Kavalai Vendam
-
దిగులు పడకురా సహోదరా..
‘దిగులు పడకురా సహోదరా..’ అనే పాట తెలిసే ఉంటుంది. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఇదే అంటున్నారు. ఏ విషయానికీ కంగారు పడొద్దు.. లైఫ్‌ని కూల్‌గా ఎంజాయ్ చేయండి అని కాజల్ అగర్వాల్ చెబుతున్నారు. విషయం ఏంటంటే... ‘కవలై వేండాం’ పేరుతో తమిళంలో జీవా సరసన తను నటించిన చిత్రాన్ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి. వెంకటేశ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. కవలై వేండాం అంటే.. దిగులు పడొద్దు అని అర్థం. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఫీల్ గుడ్ మూవీ ఇది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. హృదయానికి హత్తుకునే సన్నివేశాలు కూడాఉన్నాయి. జీవా, కాజల్ కెమిస్ట్రీ బాగుంటుంది. లియోన్ జేమ్స్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
నా మనసుకి దగ్గరైన చిత్రమిది - కాజల్
‘జీవా, కాజల్ అగర్వాల్ జంటగా డీకే దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘కవలై వేండాం’. ఈ చిత్రాన్ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో డి.వెంకటేశ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను హీరో రాహుల్ రవీంద్రన్, సినిమా ట్రైలర్‌ను నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. డి.వెంకటేశ్ మాట్లాడుతూ- ‘‘కామెడీ ఎంటర్టై నర్గా తెరకెక్కిన చిత్రమిది. ‘భలే భలే మగాడివోయ్’, ‘పెళ్లిచూపులు’ తరహాలో ఉంటుంది. సినిమా సూపర్‌హిట్ అవుతుందని ‘వెన్నెలకంటి’గారు చెప్పడం మరింత సంతోషాన్నిస్తోంది’’ అన్నారు. జీవా మాట్లాడుతూ- ‘‘డీకే నాకు స్నేహితుడు. ‘రంగం’ చిత్రానికి కో-డెరైక్టర్‌గా పనిచేశాడు. డీకే చెప్పిన కథ నచ్చడంతో వెంటనే చేశా. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘జీవా మంచి కోస్టార్. నా మనసుకు బాగా దగ్గరైన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులూ చూసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని కాజల్ అగర్వాల్ చెప్పారు. -
కవలైవేండామ్ గీతాలకు మంచి స్పందన
కవలైవేండామ్ చిత్ర గీతాలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తోందని ఆ చిత్ర యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జీవా, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన చిత్రం కవలైవేండామ్. ఇంతకు ముందు కో, యామిరుక్క భయమే, కో-2 వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్ఎస్.ఇన్ఫోటెయిన్మెంట్ ఎల్రెడ్.కుమార్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. అదే విధంగా యామిరుక్క భయమే చిత్రం ఫేమ్ డీకే దర్శకత్వం వహిస్తున్న చిత్రం క వలైవేండామ్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన రెండు టీజర్లకు ప్రేక్షకుల మధ్య విశేష స్పందన లభించిందని, దీంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది. కో-2 చిత్రంతోనే సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ మంచి పేరు తెచుకున్నారని, కవలైవేండామ్ చిత్రం ఆయనకు మరింత ప్రాచుర్యం చేస్తుందని అన్నారు. ఇందులోని ఉన్ కాదల్ ఇరుందాల్ పోదుం, నా తొలందాయో అనే పాటలు సంగీత ప్రియుల మధ్య విశేష ఆదరణ పొందుతున్నాయని తెలిపారు.ఈ తరానికి కావలసిన అన్ని అంశాలతో యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టెయినర్గా తెరకెక్కించిన కవలైవేండామ్ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని చిత్ర నిర్మాత వ్యక్తం చేశారు. -
కవలైవేండామ్‌కు బాలీవుడ్ గాయకుడి పాట
కవలైవేండామ్ చిత్రానికి బాలివుడ్ ప్రముఖ గాయకుడు అర్మూన్ మాలిక్ పాట పాడడం విశేషం. జీవా నటించిన తిరునాళ్ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇందులో నయనతార నాయకిగా నటించారు. జీవా నటిస్తున్న మరో చిత్రం కవలైవేండామ్. ఇంతకు ముందు కో, కో-2, యామెరుక్కక భయమే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎల్రెడ్.కుమార్ తన ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం కవలైవేండామ్. డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి లియో జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన తెలుపుతూ బాలీవుడ్ గాయకుడు అర్మాన్ మాలిక్ గానానికి మైమరచిపోని వారుండరన్నారు.అలాంటిది తాను ఆయన అభిమానినని తెలిపారు. ఆయన ఇంతకు ముందు పాడిన ఉన్ కాదల్ పాట తరహాలో కవలైవేండామ్ చిత్రం కోసం ఒక మెలోడి పాట పాడించాలని భావించామన్నారు. ఆయన్ని సోషల్ మీడియా ద్వారా సంప్రదించి తమకు ఒక పాట పాడాలని కోరామన్నారు. వెంటనే ఆయన పాట లిరిక్స్ పంపమని చెప్పగా తాను ట్యూన్ సహా పాటను పంపామన్నారు. పాట విన్న అర్మాన్ మాలిక్ చాలా బాగుందంటూ పాడారన్నారు. దీని ముంబాయిలోని ఒక ప్రముఖ రికార్డింగ్ స్టూడియోలో రికార్డు చేసినట్లు వెల్లడించారు. ఈ పాట కచ్చితంగా ప్రేక్షకులకు వీనుల విందుగా ఉంటుందని అన్నారు. -
దిగులు పడొద్దు!
‘‘మంచో.. చెడో.. లవ్‌లో ఫెయిల్ అయితే లైఫ్ ఎండ్ అయినట్లు కాదు. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటకు వచ్చేయాలి. బ్రేకప్ తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలి’’ అని కాజల్ అగర్వాల్ వేదాంత ధోరణిలో మాట్లాడారు. కొంపతీసి కాజల్ ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? ఆ ప్రేమకు మధ్యలోనే ఎండ్ కార్డ్ పడిందా? అని ఆలోచించవలసిన అవసరం లేదు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదొక తరుణంలో ఎవరో ఒకరితో ప్రేమలో పడతారు. ప్రతి ప్రేమకథా పెళ్లి పీటల వరకూ వెళ్తుందా..? అని ప్రశ్నిస్తే సమధానం చెప్పడం కష్టమే. లవ్.. బ్రేకప్.. యూత్ రిలేషన్షిప్స్.. ఇలాంటి అంశాలతో తెరకెక్కిన తమిళ సినిమా ‘కవలై వేండాం’లో కాజల్ నటించారు. దిగులు పడొద్దు అని ఆ టైటిల్ అర్థం. ఆ సినిమాలో నటించిన అనుభవంతో కాజల్ బ్రేకప్ చిట్కాలు చెప్తున్నారు. ‘లవ్.. బ్రేకప్.. లైఫ్‌లో పాసింగ్ క్లౌడ్స్ వంటివి. ఒకవేళ లవ్‌లో పడ్డా మనం ఎవరు అనేది మరువకూడదు. మన ప్రాముఖ్యతను ఎప్పటికీ తగ్గించుకోకూడదు. లవర్ తప్ప మరో ప్రపంచం లేదనట్లుగా బతకకూడదు. అప్పుడు బ్రేకప్ అయినా పెద్దగా బాధ అనిపించదు. బ్రేకప్ నుంచి బయటకు రావడానికి ఓ నినాదం అంటూ ఏమీ లేదు’’ అని సెలవిచ్చారు కాజల్. ఇటీవల ఎక్కడ చూసినా.. కథానాయికల ప్రేమ, పెళ్లి వార్తలే. కాజల్ కూడా త్వరలో ఈ కబుర్లు చెప్పే అవకాశం వస్తుందా? అంటే ‘అందుకు చాలా టైముంది!’ అని నవ్వేశారు.