దిగులు పడొద్దు!
‘రంగం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయకుడు జీవా, కలువ కళ్ల పిల్ల కాజల్ జంటగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘కవలై వేండామ్’. అంటే.. దిగులు పడొద్దు అని అర్థం. డీకే దర్శకత్వంలో ‘రంగం’ చిత్ర నిర్మాత ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా తెలుగులో టైటిల్ నిర్ణయించలేదు. అక్టోబర్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.