entavaraku ee prema
-
ఎంతవరకు?
కలువ కళ్ల పిల్ల కాజల్ అగర్వాల్ ఇప్పుడు మాంచి జోరు మీదున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రానా సరసన నటిస్తున్నారు. తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య ‘జనతా గ్యారేజ్’లో చేసిన ప్రత్యేక పాట ద్వారా తెరపై కనిపించారామె. ఇయర్ ఎండింగ్లో మరోసారి తెరపై కనిపించనున్నారు. జీవా, కాజల్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘కవలై వేండాం’ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో డి.వెంకటేష్ ఈ నెల 30న విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇది మంచి కామెడీ ఎంటర్టైనర్. జీవా, కాజల్ మధ్య రొమాంటిక్ సీన్స్ యువతను ఆకట్టు కుంటాయి. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగులో ఒకేసారి విడుదల చేయా లనుకున్నాం. కానీ, తెలుగులో సెన్సార్ సకాలంలో పూర్తి కాకపోవడంతో కుదర లేదు. తమిళంలో లానే తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
నా మనసుకి దగ్గరైన చిత్రమిది - కాజల్
‘జీవా, కాజల్ అగర్వాల్ జంటగా డీకే దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘కవలై వేండాం’. ఈ చిత్రాన్ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో డి.వెంకటేశ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను హీరో రాహుల్ రవీంద్రన్, సినిమా ట్రైలర్‌ను నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. డి.వెంకటేశ్ మాట్లాడుతూ- ‘‘కామెడీ ఎంటర్టై నర్గా తెరకెక్కిన చిత్రమిది. ‘భలే భలే మగాడివోయ్’, ‘పెళ్లిచూపులు’ తరహాలో ఉంటుంది. సినిమా సూపర్‌హిట్ అవుతుందని ‘వెన్నెలకంటి’గారు చెప్పడం మరింత సంతోషాన్నిస్తోంది’’ అన్నారు. జీవా మాట్లాడుతూ- ‘‘డీకే నాకు స్నేహితుడు. ‘రంగం’ చిత్రానికి కో-డెరైక్టర్‌గా పనిచేశాడు. డీకే చెప్పిన కథ నచ్చడంతో వెంటనే చేశా. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘జీవా మంచి కోస్టార్. నా మనసుకు బాగా దగ్గరైన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులూ చూసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని కాజల్ అగర్వాల్ చెప్పారు.