ఎంతవరకు? | kajal agarwal's entavaraku ee prema movie release on 30th | Sakshi
Sakshi News home page

ఎంతవరకు?

Published Wed, Dec 21 2016 12:32 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

ఎంతవరకు? - Sakshi

ఎంతవరకు?

కలువ కళ్ల పిల్ల కాజల్‌ అగర్వాల్‌ ఇప్పుడు మాంచి జోరు మీదున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రానా సరసన నటిస్తున్నారు. తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య ‘జనతా గ్యారేజ్‌’లో చేసిన ప్రత్యేక పాట ద్వారా తెరపై కనిపించారామె. ఇయర్‌ ఎండింగ్‌లో మరోసారి తెరపై కనిపించనున్నారు.

జీవా, కాజల్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘కవలై వేండాం’ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో డి.వెంకటేష్‌ ఈ నెల 30న విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇది మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌. జీవా, కాజల్‌ మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ యువతను ఆకట్టు కుంటాయి. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగులో ఒకేసారి విడుదల చేయా లనుకున్నాం. కానీ, తెలుగులో సెన్సార్‌ సకాలంలో పూర్తి కాకపోవడంతో కుదర లేదు. తమిళంలో లానే తెలుగులోనూ సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement