24న కవలైవేండామ్ | Kavalaivendam release on 24th | Sakshi
Sakshi News home page

24న కవలైవేండామ్

Published Wed, Nov 23 2016 2:14 AM | Last Updated on Tue, Oct 30 2018 7:36 PM

24న కవలైవేండామ్ - Sakshi

24న కవలైవేండామ్

యువ నటుడు జీవా, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ఇంతకు ముందు కో, యామిరుక్క భయమే పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్‌ఎస్.ఇన్ఫోటెరుున్‌మెంట్ సంస్థ అధినేత ఎల్‌రెడ్.కుమార్ నిర్మించిన తాజా చిత్రం కవలైవేండామ్. జీవా, కాజల్‌అగర్వాల్ హీరోహీరోరుున్లుగా నటించిన ఇందులో నటి సునైనా, ఆర్‌జే.బాలాజీ, మరుుల్‌సామి, బాలశరవణన్, మనోబాల, శ్రుతి రామకృష్ణన్, మధుమిత ముఖ్య పాత్రలను పోషించారు. ఇంతకు ముందు ఇదే నిర్మాణ సంస్థలో యామిరుక్క భయమే వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు డీకే రెండో చిత్రం ఇది. చిత్రం గురించి ఆయన తెలుపుతూ జీవితం చాలా చిన్నది.

దాన్ని ఎలాంటి చింతా లేకుండా గడపాలన్న కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం కవలైవేండామ్ అని చెప్పారు. ఇందులో కథానాయకుడిగా నటించిన జీవా తన పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి. పాత్రలను అంకిత భావంతో నటించడం వల్లే తమిళ చిత్రపరిశ్రమలో ప్రముఖ హీరోగా రాణిస్తున్నారన్నారు. తన అద్భుతమైన నటనతో ఈ చిత్రానికి సరికొత్త కలర్‌ను తీసుకొచ్చారన్నారు. ఇక నటి కాజల్‌అగర్వాల్‌కు నటనై ఆసక్తి, ప్రేమే ఆమెకు అజిత్, విజయ్ వంటి ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాలను అందిస్తున్నాయన్నారు. జీవా, కాజల్‌అగర్వాల్ జంట ఈ చిత్రానికి చాలా ఎస్సెట్ అని పేర్కొన్నారు.

అదే విధంగా మనసుకు హత్తుకునే పాటలు, కడు రమ్యమైన కథాంశం కవలైవేండామ్ చిత్రానికి పక్కా బలం అన్నారు. లియోన్ జేమ్స్ చాలా మంచి సంగీతాన్ని అందించారని, అభినందన్ చాయాగ్రహణం చిత్రానికి మరింత వన్నెను తీసుకొచ్చిందని తెలిపారు.కవలైవేండామ్ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు  దర్శకుడు డీకే వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement