Kavalaivendam
-
24న కవలైవేండామ్
యువ నటుడు జీవా, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ఇంతకు ముందు కో, యామిరుక్క భయమే పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్ఎస్.ఇన్ఫోటెరుున్మెంట్ సంస్థ అధినేత ఎల్రెడ్.కుమార్ నిర్మించిన తాజా చిత్రం కవలైవేండామ్. జీవా, కాజల్‌అగర్వాల్ హీరోహీరోరుున్లుగా నటించిన ఇందులో నటి సునైనా, ఆర్జే.బాలాజీ, మరుుల్సామి, బాలశరవణన్, మనోబాల, శ్రుతి రామకృష్ణన్, మధుమిత ముఖ్య పాత్రలను పోషించారు. ఇంతకు ముందు ఇదే నిర్మాణ సంస్థలో యామిరుక్క భయమే వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు డీకే రెండో చిత్రం ఇది. చిత్రం గురించి ఆయన తెలుపుతూ జీవితం చాలా చిన్నది. దాన్ని ఎలాంటి చింతా లేకుండా గడపాలన్న కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం కవలైవేండామ్ అని చెప్పారు. ఇందులో కథానాయకుడిగా నటించిన జీవా తన పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి. పాత్రలను అంకిత భావంతో నటించడం వల్లే తమిళ చిత్రపరిశ్రమలో ప్రముఖ హీరోగా రాణిస్తున్నారన్నారు. తన అద్భుతమైన నటనతో ఈ చిత్రానికి సరికొత్త కలర్‌ను తీసుకొచ్చారన్నారు. ఇక నటి కాజల్‌అగర్వాల్‌కు నటనై ఆసక్తి, ప్రేమే ఆమెకు అజిత్, విజయ్ వంటి ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాలను అందిస్తున్నాయన్నారు. జీవా, కాజల్‌అగర్వాల్ జంట ఈ చిత్రానికి చాలా ఎస్సెట్ అని పేర్కొన్నారు. అదే విధంగా మనసుకు హత్తుకునే పాటలు, కడు రమ్యమైన కథాంశం కవలైవేండామ్ చిత్రానికి పక్కా బలం అన్నారు. లియోన్ జేమ్స్ చాలా మంచి సంగీతాన్ని అందించారని, అభినందన్ చాయాగ్రహణం చిత్రానికి మరింత వన్నెను తీసుకొచ్చిందని తెలిపారు.కవలైవేండామ్ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు దర్శకుడు డీకే వెల్లడించారు. -
అదే నా విజయ రహస్యం
నాలోని మంకుపట్టే నా విజయరహస్యం అంటోంది నటి కాజల్ అగర్వాల్. బహుభాషా నటిగా వెలుగుతున్న నటి కాజల్.ప్రస్తుతం ద్విభాష చిత్రం(తమిళం,తెలుగు)తో పాటు, జీవాకు జంటగా కవలైవేండామ్ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో విజయ్, విక్రమ్‌లతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హిందీలోనూ ఒక చిత్రం చేస్తున్న కాజల్ తాజా కబుర్లేమిటో చూద్దాం. ఎవరైనా తమ జీవితాలు సంతోషంగా సాగిపోవాలనే ఆశిస్తారు. తమ గురించే ఆలోచిస్తుంటారు. అయితే నేనలా కాదు. నా చుట్టు జరుగుతున్న విషయాల గురించి పట్టించుకుంటాను. ఇతరుల గురించి ఆలోచిస్తుంటాను. ఒక రకంగా చెప్పాలంటే అనవసర విషయాలకు ప్రాముఖ్యత నిస్తుంటాను. నాలో పెద్ద బలహీనత ఇదే. నా గురించి, నా సినిమాల గురించి ఆలోచించాలని అనుకుంటాను. అయితే అలా ఉండలేక పోతున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్లగురించి ఆలోచించలేకుండా ఉండలేకపోతున్నాను. అలాంటి ఆలోచనల నుంచి బయట పడే ప్రయత్నం చేస్తున్నాను. వినూత్న అనుభవమే నాలో మంకుపట్టు ఎక్కువ. ఏదైనా దక్కించుకోవాలనుకుంటే దాన్ని పొందేవరకూ విశ్రమించను. ఆశించింది చేరువైన తరువాతనే ఇతర విషయాలపై దృష్టి సారిస్తాను. ఈ మంకుపట్టే నన్ను ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టింది. నా బలం ఇదే.నేను చిత్రం రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లో మంచి కథా పాత్రలు వరించాయి.అప్పట్లో భాష సమస్య ఉన్నా నటించగలనన్న ఆత్మస్థైర్యంతోనే వాటిని అంగీకరించాను. అప్పట్లో ఆ అవకాశాలను అంగీకరించడానికి సందేహించి ఉంటే సినిమాలో వెనకబడిపోయేదాన్ని.మొండి ధైర్యంతోనే ఆ అవకాశాలను అంగీకరించి ఉన్నత స్థాయికి చేరుకున్నాను. నాకు ఒక్కో చిత్రం ఒక్కో వినూత్న అనుభవాన్ని ఇచ్చింది. ఇక్కడ చాలా నేర్చుకున్నాను. అవన్నీ భవిష్యత్‌లో ఉపయోగపడాతాయి.