అదే నా విజయ రహస్యం | The secret of my success | Sakshi
Sakshi News home page

అదే నా విజయ రహస్యం

Published Fri, Feb 5 2016 3:37 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

అదే నా విజయ రహస్యం - Sakshi

అదే నా విజయ రహస్యం

 నాలోని మంకుపట్టే నా విజయరహస్యం అంటోంది నటి కాజల్ అగర్వాల్. బహుభాషా నటిగా వెలుగుతున్న నటి కాజల్.ప్రస్తుతం ద్విభాష చిత్రం(తమిళం,తెలుగు)తో పాటు, జీవాకు జంటగా కవలైవేండామ్ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో విజయ్, విక్రమ్‌లతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హిందీలోనూ ఒక చిత్రం చేస్తున్న కాజల్ తాజా కబుర్లేమిటో చూద్దాం. ఎవరైనా తమ జీవితాలు సంతోషంగా సాగిపోవాలనే ఆశిస్తారు. తమ గురించే ఆలోచిస్తుంటారు. అయితే నేనలా కాదు. నా చుట్టు జరుగుతున్న విషయాల గురించి పట్టించుకుంటాను. ఇతరుల గురించి ఆలోచిస్తుంటాను.

ఒక రకంగా చెప్పాలంటే అనవసర విషయాలకు ప్రాముఖ్యత నిస్తుంటాను. నాలో పెద్ద బలహీనత ఇదే. నా గురించి, నా సినిమాల గురించి ఆలోచించాలని అనుకుంటాను. అయితే అలా ఉండలేక పోతున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్లగురించి ఆలోచించలేకుండా ఉండలేకపోతున్నాను. అలాంటి ఆలోచనల నుంచి బయట పడే ప్రయత్నం చేస్తున్నాను.

  వినూత్న అనుభవమే నాలో మంకుపట్టు ఎక్కువ. ఏదైనా దక్కించుకోవాలనుకుంటే దాన్ని పొందేవరకూ విశ్రమించను. ఆశించింది చేరువైన తరువాతనే ఇతర విషయాలపై దృష్టి సారిస్తాను. ఈ మంకుపట్టే నన్ను ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టింది. నా బలం ఇదే.నేను చిత్రం రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లో మంచి కథా పాత్రలు వరించాయి.అప్పట్లో భాష సమస్య ఉన్నా నటించగలనన్న ఆత్మస్థైర్యంతోనే వాటిని అంగీకరించాను. అప్పట్లో ఆ అవకాశాలను అంగీకరించడానికి సందేహించి ఉంటే సినిమాలో వెనకబడిపోయేదాన్ని.మొండి ధైర్యంతోనే ఆ అవకాశాలను అంగీకరించి ఉన్నత స్థాయికి చేరుకున్నాను. నాకు ఒక్కో చిత్రం ఒక్కో వినూత్న అనుభవాన్ని ఇచ్చింది. ఇక్కడ చాలా నేర్చుకున్నాను. అవన్నీ భవిష్యత్‌లో ఉపయోగపడాతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement