రైజింగ్ కాజల్ | Kajal agarwal Pair with jeeva | Sakshi
Sakshi News home page

రైజింగ్ కాజల్

Published Sun, Aug 30 2015 2:55 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

రైజింగ్ కాజల్ - Sakshi

రైజింగ్ కాజల్

ఎవరు?ఎప్పుడు? రైజింగ్‌గా మారతారో ఎవరికీ తెలియదు. ఇక నటి కాజల్ అగర్వాల్ గురించి చెప్పాలంటే దక్షిణాదిలో ఆమె పయనం తమిళ చిత్ర పరిశ్రమ నుంచే మొదలైంది. రెండు మూడు చిత్రాలు చేసినా కాజల్‌కు ఇక్కడ అపజయాలు నిరాశనే మిగిల్చాయి. అలాంటి నటిలోని టాలెంట్‌ను తెలుగు చిత్రపరిశ్రమ గుర్తించింది. అది గ్రహించడానికి తమిళసినిమాకు చాలా ఏళ్లే పట్టింది. కార్తీ సరసన నటించిన నాన్ మహాన్ అల్ల చిత్రం కాజల్‌కు ఉత్సాహానిచ్చినా, విజయ్‌తో నటించిన తుపాకీ చిత్రం ఆమెను విజయం బాట పట్టించింది. ఆ తరువాత వెంటనే అదే ఇళయదళపతితో జిల్లా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. మళ్లీ చిన్న గ్యాప్. ఇప్పుడు కోలీవుడ్‌లో చేతినిండా చిత్రాలు.
 
 ఇటీవలే ధనష్‌తో రొమాన్స్ చేసిన మారి చిత్రం కమర్షియల్‌గా హిట్ అనిపించుకుంది.ప్రస్తుతం విశాల్ సరసన నటించిన పాయుమ్ పులి త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.ఇక విక్రమ్‌కు జంటగా మర్మమనిదన్ చిత్రంలో నటించడానికి కాజల్ రెడీ అవుతున్నారు.అదే విధంగా లారెన్స్‌తో మొట్ట శివ కెట్ట శివ చిత్రాన్ని అంగీకరించారు.వీటితో పాటు మహేశ్‌బాబుకు జంట గా తమిళం,తెలుగు భాషల్లో తెరకెక్కనున్న బ్రహ్మోత్సవం చిత్రం, పవన్‌కల్యాణ్‌తో సర్దార్ గబ్బర్ సింగ్, ఒక హిందీ చిత్రం కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో జీవాతో జత క ట్టే మరో అవకాశం ఈ భామను వరించింది.
 
  ఇంతకు ముందు కో, యామిరుక్క భయమే వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఆర్‌ఎస్.ఇన్ఫోటెయిన్‌మెంట్ సంస్థ అధినేత ఎల్ రెడ్ కుమార్ తాజాగా రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు.అందులో ఒకటి కో-2.ఇందులో బాబిసింహా నిక్కీగల్రాణి జంటగా నటిస్తున్నారు. రెండవ చిత్రం కవలైవేండామ్.ఇందులో జీవా కథానాయకుడిగా జీవా నటిస్తున్నారు.ఆయనకు జంటగా కాజల్ అగర్వాల్ ఎంపికయ్యారు.యామిరుక్క భయమే చిత్రం ఫేమ్ డీకే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.ఈ విషయం గురించి దర్శకుడు తెలుపుతూ తాను కో, మాట్రాన్ చిత్రాలకు కేవీ.ఆనంద్ వద్ద సహాయదర్శకుడిగా పని చేసినప్పుడే జీవా,కాజల్ అగర్వాల్‌లతో మంచి పరిచయం ఉందన్నారు.
 
 ఈ కథను తయారు చేసినప్పుడే హీరో జీవా అని నిర్ణయించుకున్నానని తెలిపారు.ఇక ఇందులో హీరోయిన్ పాత్రా హీరో పాత్రకు ధీటుగా ఉంటుందన్నారు.ఈ పాత్రకు చాలా మంది నటీమణుల పేర్లు పరిశీలించినట్లు చెప్పారు. అభినయానికి స్కోప్ ఉన్న ఈ పాత్రకు కాజల్ అగర్వాల్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించగా వెంటనే అంగీకరించినట్లు తెలిపారు.కాగా ఈ చిత్రంలో ముందుగా నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేసినట్లు ఆమెతో ఫొటో షూట్ కూడా నిర్వహించినట్లు తెలిసింది.ఆ తరువాత ఆమె కాల్‌షీట్స్ కేటాయించక పోవడంతో ఇప్పుడు కాజల్‌ను ఆ పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement