బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలె కట్‌పుత్లీ సినిమాతో ఆకట్టుకున్న అక్షయ్ గురించి తాజాగా బీటౌన్‌లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. ఆయనకున్న బంగ్లాలో ఒకదాన్ని దబూ మాలిక్ అనే వ్యక్తికి అమ్మేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దబూ బాలిక్ మరెవరో కాదు..ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ తండ్రే. ముంబై అంధేరి వెస్ట్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ను అక్షయ్ సుమారు రూ. 6కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తుంది.
గతంలో అక్షయ్ ఇదే అపార్ట్‌మెంట్‌ను రూ 4కోట్లకు కొనుగోలు చేశాడట. ఇక అక్షయ్‌కు ముంబైలో అంధేరీ వెస్ట్, ఈస్ట్, బొరివలీ, ములంద్, జుహు తదితర ప్రాందాల్లో పలు బంగ్లాలు ఉన్నాయి. కాగా ఆయన నటించిన చివరి చిత్రం కఠ్పుత్లీ సెప్టెంబర్ 2న హాట్ స్టార్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా రీమేక్ ఇది.
Comments
Please login to add a commentAdd a comment