Youtuber Armaan Malik Faces Trolling as He Announces Both His Wives Are Pregnant - Sakshi
Sakshi News home page

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలకు ప్రెగ్నెన్సీ.. ప్రముఖ యూట్యూబర్‌పై దారుణంగా ట్రోల్స్

Published Mon, Dec 12 2022 8:10 PM | Last Updated on Mon, Dec 12 2022 9:23 PM

YouTuber Armaan Malik faces trolling as he announces both his wives are pregnant - Sakshi

ప్రముఖ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ అర్మాన్ మాలిక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. ఇటీవల ఇన్‌స్టాలో ఇద్దరు భార్యలతో దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. తన భార్యలిద్దరూ బేబీ బంప్‌తో ఉండగా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మాలిక్‌ ట్రోల్స్‌కు గురయ్యారు. తన ఇన్‌స్టాలో మై ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆర్మాన్ మాలిక్ ఫోటోలను పంచుకున్నారు.

యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్‌ ఇద్దరు భార్యలు కృతిక,  పాయల్‌ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నారు. ఈ ఫోటోలను మాలిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయల్‌ కంటే కృతికతో ఉన్న ఫోటోలు ఎక్కువ  పోస్ట్ చేశాడని పలువురు మండిపడ్డారు. మీరు కృతికపై మాత్రమే ఎందుకు ఎక్కువ ప్రేమ చూపుతున్నారని మరికొందరు ప్రశ్నించారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి తెలివి తక్కువ వ్యక్తులకు ప్రజలు ఎలా మద్దతు ఇస్తారని మండిపడ్డారు. కొంతమంది మాత్రం అందరికీ భిన్నంగా వీరికి అభినందనలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement