Singer Armaan Malik Fires on Youtuber Prank Video - Sakshi
Sakshi News home page

Armaan Malik: గర్భంతో ఉన్న ఇద్దరు భార్యల చెంప పగలగొట్టిన అర్మన్‌!

Feb 26 2023 4:39 PM | Updated on Feb 26 2023 5:47 PM

Singer Armaan Malik Fires on Youtuber Prank Video - Sakshi

గర్భంతో ఉన్న ఇద్దరు భార్యలు పాయల్‌, కృతికలపై చేయి చేసుకున్నాడు.

అర్మన్‌ మాలిక్‌.. హిందీలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు పాడి జనాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తన గాన మాధుర్యానికి ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చిపడ్డాయి. అర్మన్‌ మాలిక్‌ పేరిట ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది. కానీ అది ఇతడిది కాదు. అర్మన్‌ అలియాస్‌ సందీప్‌ ఈ ఛానల్‌ నడుపుతూ వీడియోలు చేస్తుంటాడు. తాజాగా అతడు యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సందీప్‌ గర్భంతో ఉన్న ఇద్దరు భార్యలు పాయల్‌, కృతికలపై చేయి చేసుకున్నాడు. చివర్లో మాత్రం ఇదంతా ప్రాంక్‌ అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే యూట్యూబర్‌ అర్మన్‌ మాలిక్‌ తన ఇద్దరు భార్యల చెంప పగలగొట్టాడంటూ నెట్టింట వార్తలు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై సింగర్‌ అర్మన్‌ మాలిక్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 'అతడిని అర్మన్‌ మాలిక్‌ అని పిలవడం ఇక ఆపండి. అతడి అసలు పేరు సందీప్‌. నా పేరును దుర్వినియోగం చేస్తున్నాడు. పొద్దుపొద్దున్నే ఇలాంటి వార్తలు చదివాల్సి వస్తుంటే అసహ్యంగా అనిపిస్తోంది. ఇవి నాకు ఎంతగానో చిరాకు తెప్పిస్తున్నాయి' అని ట్వీట్‌ చేశాడు. దీనిపై యూట్యూబర్‌ స్పందిస్తూ అర్మన్‌ మాలిక్‌ పేరుతో ఈ ప్రపంచంలో ఒక్కడే ఉండాలా? ఆ పేరు ఎవరూ పెట్టుకునే అర్హత లేదా? అని ప్రశ్నించాడు. మీరంటే బాలీవుడ్‌ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఫేమస్‌ అయ్యారు. కానీ నాకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. ఏదో వీడియోలు, బ్లాగ్‌లు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పుకొచ్చాడు.

చదవండి: 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి, నటుడి పెళ్లి ఫోటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement