కిరణ్ కొర్రపాటి, అల్లు అరవింద్, వరుణ్ తేజ్, సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్
ఈ ఏడాది ‘ఎఫ్ 2, గద్దలకొండ గణేష్’ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న వరుణ్ తేజ్ కొత్త చిత్రానికి గురువారం కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు నాగబాబు క్లాప్ ఇచ్చారు.
అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటిలకు స్క్రిప్ట్‌ను అందించారు. కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘బాక్సింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. వరుణ్‌గారు కథ వినగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ మూవీ కోసం అమెరికాకు వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకుని చాలా మేకోవర్ అయ్యారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి.విలియమ్స్, సంగీతం: తమన్.ఎస్.
Comments
Please login to add a commentAdd a comment