Baahubali Prabhakar New Movie Opening Deets Here - Sakshi
Sakshi News home page

Baahubali: బాహుబలి కాలకేయ కొత్త సినిమా ప్రారంభం

Published Fri, Apr 8 2022 9:50 AM | Last Updated on Fri, Apr 8 2022 10:49 AM

Bahubali Prabhakar New Movie Opening - Sakshi

‘బాహుబలి’ ప్రభాకర్, ‘షకలక’ శంకర్‌  ప్రధాన పాత్రల్లో పాలిక్‌ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. రావుల రమేష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి నిర్మాత ప్రసన్నకుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుల సంఘం అధ్యక్షుడు వై. కాశీ విశ్వనాథ్‌ క్లాప్‌ కొట్టారు. ‘బాహుబలి’ ప్రభాకర్‌ మాట్లాడుతూ – ‘‘రిటైర్డ్‌ మిలటరీ మేజర్‌ జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది? అనే కథతో తెరకెక్కుతున్న చిత్రమిది.

సినిమాకు కీలకమైన పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాం’’ అన్నారు రావుల రమేష్‌. పాలిక్‌ మాట్లాడుతూ – ‘‘నా శిష్యురాలు వింధ్య రెడ్డి ఈ చిత్రకథ ఇచ్చారు’’ అన్నారు. వింధ్య రెడ్డి, సంగీత దర్శకుడు జాన్‌ భూషణ్‌ మాట్లాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement