'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Yakshini Web Series Trailer Telugu And OTT Release Date | Sakshi
Sakshi News home page

ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెలుగులో హారర్ సిరీస్.. ట్రైలర్ చూశారా?

Published Fri, May 24 2024 3:32 PM | Last Updated on Fri, May 24 2024 4:21 PM

Yakshini Web Series Trailer Telugu And OTT Release Date

తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. అది కూడా హారర్ బ్యాక్‌డ్రాప్ కావడం ఆసక్తి పెంచుతోంది. కొన్నిరోజులుగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సిరీస్ గురించి చెబుతూ వచ్చారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అలానే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడనేది కూడా అధికారికంగా వెల్లడించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఏ ఓటీటీలో రిలీజ్ కానుంది?

తెలుగులోనూ హారర్ కథలతో వెబ్ సిరీసులు వస్తున్నాయి. ఇప్పుడు అలా 'యక్షిణి' పేరుతో తీసిన సిరీస్‌లో మంచు లక్ష‍్మీ, వేదిక, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. 'బాహుబలి' నిర్మాతలు తీసిన ఈ సిరీస్.. జూన్ 14 నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుండటం విశేషం.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

ట్రైలర్ బట్టి చూస్తే.. యక్షిణి అనే దేవకన్య శాపానికి గురవుతుంది. దీంతో మనిషిగా పుడుతుంది. అలానే 100 మంది యువకుల్ని వశపరుచుకుని చంపితేనే శాపవిముక్తి జరుగుతుంది. దీంతో విజయవంతంగా 99 మందిని చంపిన యక్షిణి.. 100వ వాడి విషయంలో మాత్రం ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరి తాను అనుకున్నది నెరవేర్చుకుందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.

కాన్సెప్ట్ పరంగా చూస్తే ఆసక్తికరంగానే ఉంది. ట్రైలర్‌లో గ్రాఫిక్స్ కూడా పర్వాలేదనిపించేలా ఉన్నాయి. వేదిక, మంచు లక్ష‍్మి, రాహుల్ విజయ్, అజయ్ పాత్రలే మెయిన్. మరి ఈ హారర్ సిరీస్.. తెలుగు ఓటీటీ ప్రేక్షకులని ఎంతమేర ఆకట్టుకుంటుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement