
నాగార్జున
ప్రస్తుతం మల్టీస్టారర్ మోడ్‌లో ఉన్నట్లున్నారు నాగార్జున. ఆల్రెడీ తెలుగులో మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’లో నటిస్తున్నారు. ఇందులో నాని మరో హీరో. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ అనే మల్టీస్టారర్ మూవీలో చేస్తున్నారు. నాగార్జునకు ఇందులో అమితాబ్, రణ్‌బీర్ కపూర్ కో–స్టార్స్. ఇప్పుడు తమిళంలో ధనుష్‌తో కలిసి నాగార్జున నటించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్ర మాలు జరిగాయి. ఇందులో నటించడంతో పాటు ధనుష్ దర్శకత్వం కూడా వహిస్తుండటం విశేషం. ‘పవర్ పాండీ’ సినిమా తర్వాత ధనుష్ దర్శకత్వంలో వస్తున్న సెకండ్ సినిమా ఇది. ఈ చిత్రాన్ని తేనాండాళ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment