
వాసూవర్మ, నాగార్జున, అమల, అఖిల్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, బన్నీ వాసు, అల్లు అరవింద్
‘బొమ్మరిల్లు, పరుగు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్. ఆయన దర్శకత్వంలో అఖిల్ హీరోగా కొత్త చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు, వాసూ వర్మలు నిర్మించనున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. అల్లు అరవింద్ మనవరాలు బేబి అన్విత క్లాప్ కొట్టగా, అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో స్టార్ట్ కానుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అల్లు అరవింద్ భార్య నిర్మల, చిరంజీవి సతీమణి సురేఖ, అక్కినేని అమల, దర్శకులు శ్రీకాంత్ అడ్డాల, మారుతి, పరశురామ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి. మణికందన్, సంగీతం: గోపీ సుందర్.
Comments
Please login to add a commentAdd a comment